Read more!

English | Telugu

బ్రహ్మముడి స్వప్న హాట్‌ షో!

హమీదా ఖాటూన్.. ఈ పేరు పెద్దగా ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. కానీ స్టార్ మా టీవీ ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే. స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ లో స్వప్న పాత్రలో హమీద నటిస్తోంది.

బుల్లితెరపై నటించే వాళ్ళు ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లోను యాక్టివ్ గా ఉంటున్నారు. కరుణ‌భూషన్, శ్రీప్రియ లాంటి సీనియర్ యాక్టర్స్ సైతం ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్, పోస్ట్ లు చేస్తూ యంగ్ జనరేషన్ యాక్టర్స్ కు కాంపిటీషన్ వస్తున్నారు. అయితే వీరి జాబితాలోకి మేమేమి తక్కువ కాదన్నట్టు కొత్త యాక్టర్స్ రీల్స్ చేస్తున్నారు. అందులో మానస్, దీపిక రంగరాజు, హమీద, కళ్యాణ్, శ్రీప్రియ ఇలా బ్రహ్మముడి సీరియల్ లో నటిస్తోన్న అందరూ దాదాపు ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే బ్రహ్మముడి సీరియల్ లో కావ్య-రాజ్ ల జంట తర్వాత మళ్ళీ అంత పాపులారిటీ రాహుల్-స్వప్నలకే వచ్చింది. ఎందుకంటే ఇద్దరి మనస్తత్వం ఒక్కటే. ఒకరిని మించి ఒకరు ఎత్తగడలు వేస్తూ ఎప్పుడు బాగా డబ్బున్న వాళ్ళని చేసుకోవాలని కలలు కంటుంటారు. అయితే వీరిద్దరిది కన్నింగ్ మైండ్ సెట్ అనే చెప్పాలి. దీంతో 'బ్రహ్మముడి' సీరియల్ లో వీరిద్దరు నెగెటివ్ రోల్స్ లో అదరగొడుతున్నారు.

బ్రహ్మముడి సీరియల్ లో స్వప్న గా చేస్తున్న హమీద తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసింది. అది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎప్పుడు సంప్రదాయబద్ధంగా కనిపించే స్వప్న అలియాస్ హమీద.. ఇప్పుడు టాన్ జీన్స్, స్లీవ్ లెస్ షార్ట్ బ్లాక్ టాప్ వేసుకొని ప్రత్యక్షమైంది. ఆ ఫోటోని చూసిన తన ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ హాట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి.