English | Telugu

'శ్రీహాన్‌కి ఓట్లు వేయండి బాస్'.. సిరి హ‌న్మంత్ రిక్వెస్ట్‌!

బిగ్ బాస్ సీజన్ 6 మంచి రసవత్తరంగా సాగుతోంది. పోటాపోటీగా యుద్దాలు చేసుకుంటున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలను జీడి పాకంలా సాగదీసి మరీ చెప్తున్నారు. ఎలిమినేషన్ ప్రాసెస్ లో ఉన్న బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉంటే బయట వాళ్ళ సంబంధీకులు సోషల్ మీడియా ద్వారా ఓట్లు అడుగుతున్నారు. ఇక ఇప్పుడు సిరి హన్మంత్.. తన బాయ్‌ఫ్రెండ్‌ శ్రీహాన్ కోసం తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఓట్లు అడుగుతోంది.

హౌస్ లో ఎలిమినేషన్స్, నామినేషన్స్ బాగా జరుగుతున్నాయి. ఇటీవల అభినయశ్రీ హౌస్ నుంచి ఎలిమినేట్ ఐన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు శ్రీహాన్ ఎలిమినేషన్ ప్రాసెస్ లోకి వచ్చేసాడు.

గత ఎపిసోడ్ లో శ్రీహాన్ గాళ్‌ఫ్రెండ్‌ సిరి హన్మంత్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉంది. అప్పుడు బయట నుంచి శ్రీహాన్ ఆమెకు ఫుల్ సపోర్ట్ చేసాడు. ఇక ఇప్పుడు శ్రీహన్ హౌస్ లోకి వెళ్లేసరికి సిరి బయట నుంచి సపోర్ట్ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు శ్రీహన్ కి ఓట్లు వేయాలంటూ అందరిని రిక్వెస్ట్ చేస్తోంది సిరి.

కొంతమంది నెటిజన్స్ మాత్రం సపోర్ట్ చేస్తున్నాం అంటూ కామెంట్స్ పెడితే కొందరు మాత్రం గేమ్ ఆడి టైటిల్ గెలవాలి కానీ ఇలా ఓట్లు అడగడం కరెక్ట్ కాదు అంటూ సిరికి చెప్తున్నారు. మరి సిరి రిక్వెస్ట్ ప్రకారం ఫాన్స్, ఆడియన్స్, నెటిజన్స్ శ్రీహాన్ కి ఓట్లు వేస్తారా? శ్రీహాన్ ఇంట్లో ఉంటాడా? బయటికి వచ్చేస్తాడా? తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.