English | Telugu
మేకప్ లేకపోయినా అనసూయ అందగత్తే!
Updated : Sep 21, 2022
రెండు తెలుగు రాష్ట్రాల్లో బుల్లితెర మీద కనిపించే అనసూయ గురించి అందరికీ తెలుసు. జబర్దస్త్ షో ద్వారా పాపులర్ ఐన అనసూయ బుల్లి తెర క్వీన్‌గా అటు ఈవెంట్స్ లో, ఇటు మూవీస్ లో చేస్తూ తనదైన మార్క్ ని క్రియేట్ చేసుకుంది. 'రంగస్థలం', 'పుష్ప' వంటి సినిమాల్లో నటనకి స్కోప్ ఉన్న మూవీస్ లో నటించి తనను తాను ప్రూవ్ చేసేసుకుంది.
ఇక అనసూయ షూటింగ్ లేని టైంలో ఎక్కువగా విదేశాలకు వెళుతూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అలాగే తన లవ్లీ పెట్స్ తో మాట్లాడిస్తూ ఆ వీడియోస్ ని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అనసూయకు కొంచెం ఖాళీ దొరికినట్టుంది. ఇంట్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. ఎప్పుడూ మేకప్ తో ముఖాన్ని చూపించే అనసూయ ఇంట్లో మేకప్ లేకుండా తన ఫేస్ ఎలా ఉంటుందో, ఇంట్లో పొట్టి నిక్కర్లతో ఎంత ఫ్రీగా ఉంటుందో ఫొటోస్ తీసి తన ఇన్స్టాగ్రామ్ పేజీ లో పోస్ట్ చేసింది.
'మేకప్ లేకపోయినా అనసూయ అందగత్తె' అని, 'అనసూయ సో హాట్' అని, 'ఆంటీ అన్నది ఎవరు' అని ఇలా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనసూయ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.