English | Telugu

బులెట్ సాంగ్ కి బాయ్‌ఫ్రెండ్‌తో సిరి అద్దిరిపోయే పెర్ఫార్మెన్స్

సండే వస్తే చాలు బుల్లితెర మీద రకరకాల షోస్ అలరిస్తూ ఉంటాయి. చూడడానికి రెండు కళ్లు చాలవు అన్నంత ఎంటర్టైన్మెంట్ ని అందిస్తూ ఉంటాయి. అలాంటి షోస్ లోకి మొగుడ్స్ పెళ్లామ్స్ షో ఇప్పుడు సూపర్ స్పీడ్ తో బ్రేకుల్లేకుండా దూసుకెళ్ళిపోతోంది. ఇంక ఈ వారం జంటలన్నీ వారేవా అనేలా డాన్సులు చేయడమే కాదు..గేమ్స్ కూడా పోటాపోటీగా ఆడాయి.

ఇక ఈ ఎపిసోడ్ లో సిరి హన్మంత్ రెడ్ కలర్ డ్రెస్ లో శ్రీహాన్ తో జోడిగా మంచి కిక్ ఇచ్చే డాన్స్ చేసి స్టేజి దుమ్ము దులిపేసింది. ఈ జోడికి బయట కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేయకముందే సిరికి మంచి క్రేజ్ ఉంది. ఇక సిరికి జోడి గా వార్తల్లోకి ఎక్కిన శ్రీహాన్ కి కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. అతను ఒక్క రోజు బిగ్ బాస్ స్టేజి మీద కనిపించేసరికి ఆడియన్స్ అంతా అతని ఆటిట్యూడ్ కి మస్త్ ఫిదా ఇపోయారు. అలా సిరి కంటే కూడా ఇప్పుడు శ్రీహన్ ఎక్కువ క్రేజ్ ని, ఇమేజ్ ని సంపాదించుకున్నాడని చెప్పొచ్చు.

స్టార్ మా సీరియల్స్ జోడీలు, బిగ్ బాస్ జోడీలను షోకి తీసుకొచ్చి 'మొగుడ్స్ పెళ్లామ్స్' అనే ఈవెంట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక 'జానకి కలగనలేదు', 'గుప్పెడంత మనసు', 'గోరింటాకు' టీమ్స్ వచ్చి జోడి డాన్స్ పెర్ఫామ్ చేశారు. 'మగధీర' స్టైల్లో వసు, రిషి ఇద్దరు మంచిగా డాన్స్ చేయగా, 'జానకి కలగనలేదు' నుంచి అమరదీప్, ప్రియాంక రొమాంటిక్ డాన్స్ చేసి ఇరగదీసాడు.

వీళ్ళతో పాటు సిరి, శ్రీహాన్ కూడా "కమాన్ బేబీలెట్స్ గో ఆన్ ది బుల్లెట్టు" సాంగ్ కి డాన్స్ చేసి వావ్ అనిపించారు. ఇక ఈ జోడి ఎన్నో వెబ్ సిరీస్ లో కూడా కలిసి యాక్ట్ చేశారు. కానీ బుల్లితెర మీద కలిసి డాన్స్ చేయడం ఇదే మొదటిసారి. వీళ్లిద్దరు బ్రేకప్ చెప్పుకున్నారని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఇప్పుడు ఈ జోడి పెర్ఫార్మెన్స్ చూసేసరికి అంతా తూచ్ అని చెప్పినట్టుగా అనిపిస్తోంది.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.