English | Telugu

నీ కోడలిని నందు గురించి పట్టుంచుకోవద్దని చెప్పు రేవతి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -103 లో.. ముకుంద మేడపై నుంచి దూకేస్తుండగా మురారి కాపాడతాడు. "నీ ప్రేమని తప్పు పట్టట్లేదు ముకుంద" అని మురారి చెప్పడంతో ముకుంద సైలైంట్ గా ఉంటుంది. నా మీద మురారికి ఇంకా ప్రేమ అయితే ఉందని ముకుంద తన మనసులో అనుకుంటుంది. ఇప్పటి వరకు జరిగిందంతా ఒకెత్తయితే.. ఇప్పటి నుండి జరగబోయేది ఇంకొక ఎత్తు అని ముకుంద అనుకుంటుంది.

కృష్ణ కిచెన్ లో ఉంటుంది. అదే సమయంలో భవాని తనని చూస్తుంది. "కృష్ణకి నందు విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పాలి.. లేదంటే నందు గురించి డౌట్ వచ్చి కృష్ణ నిజం తెలుసుకుంటుందేమో" అని మనసులో అనుకున్న భవాని కిచెన్ లోకి వెళ్తుంది. భవానిని చూసిన కృష్ణ.. ఏంటి అత్తయ్యా కాఫీ కావాలా అని అడుగుతుంది. నేను కాఫీ ఒక్క రేవతి ఇస్తేనే తాగుతానని భవాని అనగానే.. నేను కాఫీ చెయ్యడం రేవతి అత్తయ్య దగ్గర నుండే నేర్చుకున్నానని కృష్ణ అంటుంది. మరి రేవతి లాగా పనులు చెయ్యట్లేదేంటి? అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటున్నావ్ అని భవాని అడుగుతుంది. నేను ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవట్లేదు అత్తయ్యా.. నేను నందు ఆరోగ్యం బాగుపడాలని ఆలోచిస్తున్నానని కృష్ణ అంటుంది. నువ్వు ఒక జూనియర్ డాక్టర్ వి, మేం పెద్ద డాక్టర్ ని అడిగి ఈ మందులు వాడుతున్నామని భవాని అంటుంది. ఈ మందులు కరెక్ట్ కాదని కృష్ణ మళ్ళీ వాదిస్తుంది. ఆ తర్వాత కృష్ణ కాఫీ తీసుకొని మురారి దగ్గరికి వెళ్ళేసరికి అతను పడుకుని ఉంటాడు. నిద్రలో ఉన్న మురారి మళ్ళీ కృష్ణ కాఫీ తీసుకొని వచ్చి తన జుట్టుతో చెక్కిలిగింతలు చేస్తున్నట్లు కల కంటాడు. కృష్ణ నిజంగానే కాఫీ తీసుకొచ్చి లేపుతుంది. అప్పుడు మురారి లేచి.. "అయ్యో మళ్ళీ కల కన్నానా.. నిజం కాదా" అని అంటాడు. ఏంటి నా పర్మిషన్ లేకుండా నా గురించి కల కంటున్నారా అని మురారిని అడుగుతుంది కృష్ణ. మనం బయటకు వెళ్దాం కృష్ణా.. ఈ ఒక్క రోజు లీవ్ తీసుకోవచ్చు కదా అని మురారి అడుగగా.. మా సర్ ఒప్పుకోరు.. కావాలంటే ఈవినింగ్ త్వరగా వస్తానని కృష్ణ చెప్తుంది.

ఆ తర్వాత బాక్స్ తీసుకొని వెళ్తున్న కృష్ణకి.. జాగ్రత్తగా వెళ్ళి రా అని రేవతి చెప్పి పంపిస్తుంది. అలా కృష్ణ వెళ్ళిపోయాక రేవతి దగ్గరికి భవాని వచ్చి.. "నీ కోడలిని నందు గురించి పట్టించుకోవద్దని చెప్పు" అని అంటుంది. ఇక స్టేషన్ కి వెళ్తున్న మురారి దగ్గరికి ముకుంద వెళ్తుంది. కృష్ణ ఒక్కతే కాలేజీకి వెళ్లి వస్తుంది కదా అని ముకుంద అనగానే.. నేను తీసుకెళ్ళకుండా చేసింది నువ్వే కదా అని మురారి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.