English | Telugu

ఆ జుట్టేంటి..ఆ అవతారం ఏంటి.. ఎవరికైనా చూపించండి పాపం

బుల్లితెర మీద వచ్చే ప్రతీ షోలో కామెడీ కంపల్సరీ ఐపోయింది. ఆడియన్స్ కూడా కామెడీ పంచెస్ ని, ప్రాస కవితాల్నే ఇష్టపడుతున్నారు. 'సరిగమప ఛాంపియన్‌షిప్' ప్రోమోలో ప్రతీ వారం లాగే ఈ వారం మంచి కామెడీ బిట్స్ తో రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ "కంటెస్టెంట్ ఛాలెంజ్ రౌండ్" అని అనౌన్స్ చేసాడు హోస్ట్ ప్రదీప్.

ఇందులో ముందుగా వాగ్దేవి-ప్రజ్ఞ మంచి సాంగ్ పాడి అలరించారు. వాళ్ళు పాడిన సాంగ్ జడ్జి ఎస్పీ శైలజ గారికి తెగ నచ్చేసింది. దిష్టి తీసేద్దామా అని చెప్పి ఇద్దరికీ స్టేజిపైనే దిష్టి తీశారామె. "ప్రజ్ఞ అక్క భయపడకుండా ఉండాలంటే ఆమెకు ఏం చెప్తావ్" అని ప్రదీప్ వాగ్దేవిని అడిగేసరికి "భయం వేసినప్పుడు ఇష్టమైన పనులు చేయాలని చెప్తా" అనేసరికి "రామ్మా రా..మా పక్కన సీట్ వేయండి" అని శైలజమ్మ కామెడీ చేశారు. దాంతో వాగ్దేవి నవ్వేసింది. "ఇంత అమాయకంగానే ఉండాలి.. ఇంతకుమించి వేరేగా పెరగొద్దు" అన్నారు శైలజ ఒక సలహాను వాగ్దేవికి ఇచ్చారు. వెంటనే మరో జడ్జి అనంత శ్రీరామ్ "అంటే ఇప్పుడు ఎదగకుండా ఏమైనా చేయించుకోవాలా అండి" అని ఫన్నీ కౌంటర్ వేశారు. ఇక ఈ నెక్స్ట్ వీక్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా సింగర్ స్మిత ఎంట్రీ ఇచ్చారు. రావడంతోనే "సన్నజాజి పడక.." అంటూ తన సాంగ్‌ను అదే జోష్ తో పాడి మెప్పించారు. తర్వాత జడ్జి సీట్లో ఉన్న అనంత శ్రీరామ్ ను చూసి అవాక్కయ్యారు.

"అసలేంటండీ ఇది.. ఈయనేంటి అసలు.. ఆ అవతారం ఏంటి, ఆ జుట్టేంటి.. ఎవరికైనా చూపించండి పాపం.." అని స్మిత అనేసరికి "మీరు లేక బెంగ పెట్టుకుని అందరం ఇలా ఐపోయాం.." అని జోవియల్ ఆన్సర్ ఇచ్చారు "నేను లేక కాదు.. నేను లేక కాదు.." చెయ్యి పెట్టి చూపించి మరీ అనేసరికి అనంత శ్రీరామ్‌ కూడా కాస్త సిగ్గు పడినట్టే కనిపించింది. మరి ఆ మాటల వెనక ఉన్న అర్ధమేంటో తెలియాలి అంటే ఈ ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఈ ఎపిసోడ్ చూడాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.