English | Telugu

శివరాత్రి వేడుకలకు ఇండిగో విమానంలో గంగవ్వ!

కలలు నెరవేర్చుకోవడానికి టైంతో, వయసుతో అస్సలు సంబంధం అని నిరూపించింది గంగవ్వ. ఏజ్ ఈజ్ జస్ట్ ఆ నంబర్ అనే మాటకు నిలువెత్తు నిదర్శం ఆమె. చిన్నప్పటినుంచి ఎన్నో కష్టాలు పడి జీవితాన్ని నెగ్గుకొచ్చింది. సోషల్ మీడియాలో గంగవ్వ మై విలేజ్ షో ద్వారా మస్త్ ఫేమస్ అయ్యింది. దాంతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ కూడా ఇచ్చింది. తర్వాత హౌస్ నుంచి బయటికి వచ్చిన గంగవ్వకు నాగార్జున ఒక ఇల్లు కూడా కట్టి ఇచ్చారు.

ఇప్పుడు ఈమె ఫస్ట్ టైం విమానంలో జర్నీ చేసింది. గంగవ్వ, అంజి, అనిల్ ఇండిగో విమానంలో వెళ్లి ఆ ఫోటోను అనిల్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. "మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పుకోండి" అని అనిల్ క్వశ్చన్ అడిగేసరికి "ఈషా ఫౌండేషన్ సద్గురు గారి దగ్గరకు శివరాత్రి సంబరాలకు వెళ్తున్నారు కదా..సేఫ్ జర్నీ..హ్యాపీ జర్నీ " అంటూ నెటిజన్స్ అంతా రిప్లైస్ ఇచ్చారు. గంగవ్వ కొన్ని మూవీస్ లో కూడా నటించింది. చిన్న సెలెబ్రిటీస్ కి ప్రొడ్యూసర్స్ స్పెషల్ గా కేరవాన్ ఫెసిలిటీని ఇవ్వరు. కానీ గంగవ్వకు మాత్రం ప్రత్యేకంగా కేరవాన్ ఏర్పాటుచేశారట. ఈ విషయాన్ని కూడా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈమె ఫాన్స్ తో షేర్ చేసుకున్నారు.

ఒకప్పుడు బీడీ కార్మికురాలిగా పని చేసిన గంగవ్వ..ఇప్పుడు స్టార్ స్టేటస్ ని సంపాదించుకుని సోషల్ మీడియా సెలబ్రిటీ ఐపోయింది. దానికి ఆమె స్వయం కృషే కారణమని ఆమె ఫాన్స్ అంటారు. వయసు 62 ఏళ్ళు కానీ కృషి ఉంటే అంతకు మించి ఎదగొచ్చని నిరూపించింది గంగవ్వ...ఈమె నటించిన షార్ట్ ఫిలిమ్స్ ఎన్నో వ్యూస్ ని సంపాదించుకుంటాయి. 2021 హెలికాఫ్టర్ లో ప్రయాణించిన గంగవ్వ అసలు తన జీవితం ఇన్ని మలుపులు తిరిగి ఆకాశంలోకి ఎగిరే అవకాశం వస్తుందని అస్సలు ఊహించివుండరు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.