English | Telugu
చచ్చినా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళను.. అదొక డ్యామేజ్ షో!
Updated : Sep 4, 2022
ప్రముఖ పాప్ సింగర్ స్మిత అంటే తెలియని వారుండరు. ఆమె సింగర్, యాక్టర్, ఆంత్రపెన్యూర్, డాన్సర్, సోషల్ యాక్టివిస్ట్. సింపుల్ గా చెప్పాలంటే ఆల్‌రౌండర్. ఐతే చాలా ఏళ్ళు స్మిత్ తెర మీద కనిపించలేదు. ఇటీవల 'జీ సరిగమప సింగింగ్ సూపర్ స్టార్'కి జడ్జిగా వ్యవహరించింది. ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అవుతున్న టైంలో స్మిత ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
"నాగార్జున ఫ్యామిలీతో మీ ఫామిలీకి అసోసియేషన్ ఉంది కాబట్టి ఎప్పుడైనా బిగ్ బాస్ హౌస్‌లోకి రమ్మంటూ కాల్ వచ్చిందా?" అన్న ప్రశ్నకు "నేను చచ్చినా ఆ తప్పు చేయను.. ఎవరైనా చేస్తున్నా కూడా హౌస్‌లోకి వెళ్లి వచ్చాక ఏమొచ్చింది? అని అడుగుతాను. ఇలా అంటున్నందుకు సారీ చెప్తున్నా. ఎందుకంటే టెలివిజన్ రంగంలో ఇదొక డామేజ్ షో అని నా అభిప్రాయం. అంటోంది స్మిత.
"హౌస్ లోకి వెళ్ళాక మనలో వున్న టాలెంట్, మనలో అప్పటివరకు ఉన్న మంచి భావాలన్నీ కూడా పోతాయి. మనుషుల్ని ఒక హౌస్ లో పడేసి 'మీరు తన్నుకోండ్రా.. మేము టీఆర్పీలు తెచ్చుకుంటాం' అన్నట్టు ఉంటుంది ఆ షో. ఆ షో ఏమిటో నాకెప్పటికీ అర్థంకాదు. నేను అసలు ఆ షోనే చూడను.. నాకైతే అన్ని రోజులు అందరినీ వదిలేసి హౌస్ లోకి వెళ్లడం అస్సలు ఇష్టం ఉండదు. ఇంతకన్నా ఎక్కువగా చెప్పలేను. ఎందుకంటే నాకు ఇష్టమైన వాళ్ళు చాలా మంది ఈ షోలోకి వెళ్తున్నారు.. నేను ఏమన్నా అంటే వాళ్ళను అన్నట్టు ఉంటుంది." అని చెప్పింది స్మిత.