English | Telugu

మోనాల్ కి చిరాకు తెప్పించిన ఫ్యాన్!

యాంకర్ ఓంకార్ ఆధ్వర్యంలో డాన్స్ ఐకాన్ పేరుతో ఒక సరికొత్త డాన్స్ షో అనేది సెప్టెంబర్ 11 నుంచి ప్రతీ శని, ఆదివారాల్లో ఎంటర్టైన్ చేయడానికి సిద్దమయ్యింది. ఈ షోకి సంబంధించిన ప్రమోషన్స్ లో భాగంగా డాన్స్ ఐకాన్ టీమ్ నుంచి మోనాల్, యష్ మాస్టర్ ఇద్దరూ ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేశారు. ఐతే ఇందులో ఇద్దరూ కొన్ని ఫన్నీ మూమెంట్స్ ని షేర్ చేసుకున్నారు.

ఎప్పుడైనా మీ ఫాన్స్ మిమ్మల్ని అడిగిన విచిత్రమైన ప్రశ్న ఏమిటి అని యాంకర్ అడిగేసరికి "వైజాగ్ లో డాన్స్ ఐకాన్ ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు... కారులో ఉన్న నా దగ్గరకు వచ్చి ఒక కాలేజీ స్టూడెంట్ మోనాల్.. ఐ లవ్ యు.. కార్ డోర్ తియ్యి... మోనాల్ ఒక్కసారి నా మాట విను అంటూ నాకు చాలా చాలా క్లోజ్ పర్సన్ ఐనట్టుగా మాట్లాడేసరికి నవ్వాపుకోలేకపోయాను. తర్వాత నేను స్టేజి మీద మాట్లాడుతున్నంత సేపు ఆ కుర్రాడి మాటలే బ్యాక్ డ్రాప్ లో వినిపించేసరికి కొంత చిరాకు కూడా వచ్చింది. అలాగే ఇంకో ఫ్యాన్ కూడా మోనాల్ అతనితో నీ పెళ్ళెప్పుడు అని అడిగేసరికి షాకయ్యాను" అంటూ చెప్పుకొచ్చింది మోనాల్.

తర్వాత యష్ మాస్టర్ తనకు ఎదురైన విచిత్రమైన ఇన్సిడెంట్ గురుంచి చెప్పాడు. "ఒకసారి నేను వాష్ రూమ్ లో ఉన్నప్పుడు పక్కన ఒక కుర్రాడు కూడా వచ్చాడు. అప్పుడు నన్ను చూసి ఒక సెల్ఫీ ప్లీజ్ అన్నాడు. రేయ్ ఇక్కడేంట్రా సెల్ఫీ అనేసరికి పర్లేదన్నా అన్నాడు...నీకు పర్లేదురా..నాకు కాదు" అని చెప్పాను అంటూ నవ్వేసాడు యష్.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.