English | Telugu
సుమ చేసిన పనికి తల పట్టుకున్న ఆలియాభట్
Updated : Sep 4, 2022
బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న రిలీజ్ కానున్న సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లు, ప్రమోషన్స్ వంటివి బాగా జరుగుతున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో రణబీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించిన బ్రహ్మాస్త్ర మూవీని తెలుగులో ఎస్ఎస్ రాజమౌళి సమర్పణలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు ఈ మూవీ టీమ్ సుమ క్యాష్ ప్రోగ్రాంలోకి ఎంట్రీ ఇచ్చారు. రణబీర్ కపూర్, ఆలియాభట్ , మౌనిరాయ్, ఎస్ ఎస్ రాజమౌళి ఈ కార్యక్రమానికి వచ్చి సందడి చేశారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. ఈ ప్రోమోలో భాగంగా సుమ వేదిక పైకి రణబీర్ కపూర్ ఆలియాభట్ ను ఆహ్వానించి వారికి బొకే అందించింది. ఇక రాజమౌళిని వేదిక పైకి ఆహ్వానిస్తూ "ఆయన ముందు ఫ్లాప్ అనే పదం కూడా ఫ్లాప్ ఐపోయిందండి" అంటూ చెప్తుంది సుమ.
క్యాష్ ప్రోగ్రాంలో సుమ ఎప్పుడూ ఒక మోస్తరు నటీనటులతో ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది. కానీ ఈసారి షోకి ఒక రేంజ్ పర్సనాలిటీస్ వచ్చేసరికి అవాక్కయ్యింది ..ఇదంతా నిజమేనా అనుకుంటూ రాజమౌళి గారి దగ్గరకెళ్ళి "నన్ను ఒకసారి గిల్లండి అంటూ అడిగి మరీ చేతి మీదా గిల్లించుకుంటుంది. ఇది నిజమే మీరు క్యాష్ ప్రొగ్రాం వచ్చారు వచ్చారు" అంటుంది. సుమ చేసిన ఆ పనికి ఆలియాభట్ తల కొట్టుకుని నవ్వేసింది. ఇప్పుడు ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.