English | Telugu
ఈ ఫొటో చూశాక శ్రీహాన్, శ్రీసత్య మధ్య ఉన్నది కేవలం స్నేహమే.. అంటారా?
Updated : Nov 19, 2022
బిగ్ బాస్ హౌస్ లో శ్రీహాన్, శ్రీసత్య మధ్య రాపో శ్రుతిమించుతున్నట్టుగా తెలుస్తోంది. కారణం వాళ్ళు చేసే అతి నటన, అతి మాటలు. అయితే నిన్న మొన్నటిదాకా మాములు ఫ్రెండ్స్ అని అనుకున్నారంతా.. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్ చూస్తే ఎవరికైనా అది రాంగ్ అనే అనిపిస్తుంది. అయితే ఎవిక్షన్ ఫ్రీ పాస్ పొందే టాస్క్ లో శ్రీహాన్ బజర్ నొక్కాడు. దానికి విన్నర్ అమౌంట్ నుండి లక్ష రూపాయలు కట్ అవుతాయి.
ఆ తర్వాత శ్రీహాన్ తో శ్రీసత్య మాట్లాడింది. "ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో ఏం చేస్తావ్.. నీ ఫ్రెండ్ కో, వేరే ఎవరికో వాడినా వాళ్ళు ఆ వీక్ వరకే సేవ్ అవుతారు కదా" అంది."ఒక వీక్ అయినా.. నువ్వు నాతో ఉంటావ్ కదా. నువ్వు ఉన్న వాల్యూ ఒక లక్ష యాభై అంటే అది తక్కువే కదా. లక్ష యాభై అయినా రెండు లక్షలు అయినా, నా అమౌంట్ లో నుండి కట్ చేస్తారంటే నాకు ఓకే" అన్నాడు శ్రీహాన్. అతను అలా అనేసరికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక నవ్వేసింది శ్రీసత్య. ఆ తర్వాత శ్రీహాన్ మెల్లగా కవర్ చేసాడు. "అయ్యయ్యో.. మరి అదే కదా ఫ్రెండ్ షిప్ అంటే.. శ్రీసత్యా! నువ్వు అయితే ఏంటి, రేవంత్ అయితే ఏంటి, నా ఫ్రెండ్స్ తో నేను ఉండాలి. అదే నాకు కావాలి" అన్నాడు.
ఇలా ఎవరికి అనుమానం రాకుండా కవర్ చేసాడు.ఆ తర్వాత శ్రీహాన్ "అయినా.. ఒక విన్నర్ కి ద్రోహం జరగదని, బిగ్ బాస్ అలా చూడడు అని నా గట్టి నమ్మకం" అని శ్రీసత్యతో అన్నాడు. అయితే హౌస్ మేట్స్ ఎవరైనా అడిగితే.. ఎప్పటికప్పుడు "మా మధ్య ఏమీ లేదు. మేం బెస్ట్ ఫ్రెండ్స్" అని అంటున్నారు. కాగా వీరిద్దరు స్నేహం అనే బాండింగ్ దాటేసారు అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకునే కొన్ని మాటలు వేరేలా పొర్ట్రేట్ అవుతున్నాయి.