English | Telugu
ప్రొపోజ్ కూడా చేయలేనంత బాడ్ గా ఉన్నానా ఏంటి నేను..?" రోహిణి పై శివాని ఫైర్
Updated : Nov 5, 2022
"డాన్స్ ఇండియా డాన్స్" షో మిగతా డాన్స్ షోస్ తో పోటాపోటీగా పరిగెత్తడానికి ట్రై చేస్తోంది. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో "అహ నా పెళ్ళంట" మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తరుణ్, శివాని ఎంట్రీ ఇచ్చేసారు. ఇక రాజ్ తరుణ్ మంచి జోష్ మీద ఉన్నాడేమో ఈ ఎపిసోడ్ లో సరదాగా జోక్స్ వేసాడు. ఇక రౌడీ రోహిణి తన పేరుకు తగ్గట్టే బిహేవ్ చేసింది. ఉయ్యాలైన జంపాలైనా అని రాజ్ తరుణ్ తో కలిసి పాట పాడడమే కాదు అతన్ని రెండు చేతులతో ఎత్తేసి బొంగరంలా తిప్పేసింది. "అవకవక పెళ్లౌతోంది" అని రోహిణి అనేసరికి " ఆల్ ది బెస్ట్ అండి..మిమ్మల్ని చేసుకోబోయేవాడికి" అని కౌంటర్ వేసాడు రాజ్ తరుణ్. తర్వాత హోస్ట్ అకుల్ బాలాజీ " మీ లైఫ్ లో బార్బీ డాల్ ఎవరూ లేరా" అని రాజ్ తరుణ్ ని అడిగేసరికి " ఉందిగా" అని రోహిణి చూపించాడు.
"నా గురించి వద్దు " అని రోహిణి కామెడీ చేసేసరికి "బిస్కెట్ వేసినప్పుడు తీసుకోవాలి" అన్నాడు రాజ్.. "మీరు మరీ ఎక్కువ బిస్కెట్స్ వేసేస్తున్నారు..నాకే నమ్మకం కుదరట్లేదు" అని కౌంటర్ వేసింది రోహిణి. ఇక తర్వాత "నీకెవరూ ప్రొపోజ్ చేయలేదా" అని శివానిని రోహిణి అడిగేసరికి " జరుగుతూ ఉంటాయి కదండీ..ప్రొపోజ్ కూడా చేయలేనంత బాడ్ గా ఉన్నానా ఏంటి నేను" అని నవ్వేసింది. ఇక డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ఒక్కోటి ఒక్కో లెవెల్లో చేశారు కంటెస్టెంట్స్. ఇక మూడు జోడీలు ఎలిమినేషన్ రౌండ్ లోకి అడుగుపెట్టాయి. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారు..ఏ ఒక్క జోడి సేవ్ అవుతుందో చూడాలి...