English | Telugu

జానకి కలగనలేదు సీరియల్ లో శివ గెస్ట్ రోల్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'జానకి కలగనలేదు' ఈ సీరియల్ లో రాశి నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో అమర్ దీప్, ప్రియాంక జైన్ ముఖ్య పాత్రలని పోషిస్తున్నారు. ఈ సీరియల్ ద్వారా ప్రియాంక జైన్ సీరియల్స్ లో ముఖ్యమైన పాత్రని పోషించే నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది.

జానకి కలుగలేదు సీరియల్ తో అమర్ దీప్, ప్రియాంక జైన్ కి ఎంతగా క్రేజ్ వచ్చిందో అందరికి తెలిసిందే. అయితే తాజాగా 'నీతోనే డ్యాన్స్' షోలో పార్టిసిపేట్ చేసిన ప్రియాంక జైన్-శివ కుమార్ జోడీ తమ పర్ఫామెన్స్ తో ఆకట్టున్నారు. కాగా వీరిద్దరు కలిసి 'నెవెర్ ఎండింగ్ టేల్స్' అనే యూట్యూబ్ ఛానెల్ ని కూడా స్టార్ట్ చేశారు. అందులో వీరిద్దరు కలిసొ రెగ్యులర్ గా వ్లాగ్స్ చేస్తూ ట్రెండింగ్ లో ఉంటున్నారు. శివ కుమార్, ప్రియాంక జైన్ కలిసి చేసిన ప్రతీ వీడియోకి అత్యధిక వీక్షకాధరణ లభిస్తుంది.

ప్రియాంక జైన్ కి ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ బేస్ బాగుంది. ఆమెకు ఫ్యాన్ పేజెస్ కూడా చాలా ఉన్నాయి. కాగా తను యాక్ట్ చేస్తున్న సీరియల్ కి సంబంధించిన ప్రతీ విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ లో అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది ప్రియాంక జైన్. అయితే ప్రియాంక, శివ కలిసి చేసిన తాజా వ్లాగ్ ఆసక్తికరంగా ఉంది. 'శివ గెస్ట్ అప్పీరెన్స్ ఇన్ జానకి కలగనలేదు' అనే టైటిల్ తో ఈ వీడియోని యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసారు. కాగా శివ ఆ సెట్ కి వెళ్ళి అక్కడ ఉన్న జానకి కలగనలేదు టీంతో మాట్లాడుతూ సరదగా గడిపాడు. అయితే ఈ సీరియల్ ఫ్యాన్స్ తమ కామెంట్లతో శివకి అభినందనలను తెలుపుతున్నారు. కాగా ఈ వీడియో యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.