English | Telugu

అమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ అంటున్న హరిత జాకీ!

హరిత జాకీ.. టెలివిజన్ సీరియల్స్ లో నటిస్తూ పాపులారిటీ సంపాదించుకున్న నటి. చెన్నై లో పుట్టి పెరిగిన హరిత.. తన పదిహేనవ ఏటనే సినిమాలలో నటించింది. అయితే తనకి సీరియల్స్ తో మంచి గుర్తింపు వచ్చిందనే చెప్పాలి.

జాకీని పెళ్ళి చేసుకుంది హరిత. వాళ్ళిద్దరు దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలలో కలిసి నటించేవారు. ఆ తర్వాత ఈటీవిలో ప్రసారమైన 'సంఘర్షణ' సీరియల్ లో తొలిసారి తన భర్త జాకీతో‌ కలిసి నటించింది. అప్పటి నుండి చాలా సీరియల్స్ లలో ఇద్దరు కలిసి నటించారు. అయితే జీ తెలుగులో ప్రసారమైన 'కలవారి కోడళ్ళు' సీరియల్ లో తను చేసిన నటనకి గాను అవార్డ్ కూడా వచ్చింది. ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ టాప్ మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్ గా ఉంది. అయితే జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'ముద్ద మందారం' లో తనకి ప్రశంసలు దక్కాయి.

హరిత అండ్ జాకీ ఇద్దరు కలిసి రెగ్యులర్ గా రీల్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. అయితే హరిత తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని తన యూట్యూబ్ ఛానెల్ లో వ్లాగ్ లుగా చేస్తూ అప్లోడ్ చేస్తుంటుంది. తన కొత్త సీరియల్ కోసం తీసుకున్న శారీస్ అని ఒక‌ వ్లాగ్, వాళ్ళ అమ్మ బర్త్ డే కోసం తీసుకున్మ బంగారం అంటూ ఒక వ్లాగ్, షూటింగ్ నుండి వచ్చాక ఇది నా పరిస్థితి అంటూ మరొక వ్లాగ్ చేయగా అన్నింటికి లక్షల్లో వ్యూస్ వచ్చాయి. అయితే తాజాగా తిరుపతికి వెళ్ళి శ్రీనివాసుడి దర్శనం చేసుకున్నామంటూ ఒక వ్లాగ్ ని చేసారు హరిత జాకీ. అయితే హరిత వాళ్ళ అమ్మ బర్త్ డే ముందు ఇలా వెళ్ళాలని అనుకోలేదు. అక్కడ దారిలో వెళ్తుంటే సింగర్ గీతామధురి కూడా కలిసిందని వ్లాగ్ లో చూపించింది హరిత. ఇదంతా 'అమ్మ బర్త్ డే సెలబ్రేషన్స్ షురూ' అనే టైటిల్ తో తన యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసింది హరిత. కాగా ఇప్పుడు ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.