English | Telugu
తెల్వని ప్లేస్ కదా నువ్ ఏది చెప్తే అదే.. న్యూయార్క్ వీధుల్లో కొత్త జంట
Updated : Jun 25, 2023
రాకింగ్ రాకేష్-సుజాత ఆన్ స్క్రీన్ మీద లవ్ చేసుకున్నారు.. ఆఫ్ స్క్రీన్ లో పెళ్లి చేసుకున్నారు. వీళ్ళు జబర్దస్త్ లో మంచి మంచి స్కిట్స్ తో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వీళ్ళిద్దరూ రీసెంట్ గా న్యూయార్క్ కి వెళ్లారు. అక్కడ అన్ని చూసి ట్రిప్ ని బాగా ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన వీడియోని కూడా రాకేష్ తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసాడు.
న్యూయార్క్ లో వాల్ స్ట్రీట్ కి వెళ్లారు సుజాత -రాకేష్ .. అక్కడ ఉన్న బిల్డింగ్స్ ని చూపించారు. ప్రపంచంలో ఎక్కడ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజి జరగాలి అన్నా కూడా ఇక్కడి నుంచే జరగాలి అంటూ ఆ వీధిని కూడా చూపించారు. "ఇక్కడి బిల్డింగ్స్ ని చూస్తూ ఉంటే అంతా మాయమాయగా ఉండేసరికి సుజాతకు అసలు ఏం అర్ధం కావడం లేదన్నారు" రాకేష్. "అసలు ఈ బిల్డింగ్స్ అన్నిటిని నిలబెట్టి కట్టారా...పడుకోబెట్టి కట్టాక నిలబెట్టారా, వీటిని కట్టాక డిజైన్ చేశారా..డిజైన్ చేసాక కట్టారా" అని చాలా డౌట్స్ అడిగేసరికి రాకేష్ షాకయ్యాడు. తరువాత న్యూయార్క్ లో సందులు గొందులు తిరుగుతూ వచ్చారు. చూడడానికి చాలా బాగుంది న్యూయార్క్ సిటీ అని రాకేష్ అంటే ఇక్కడా అమ్మమ్మలు, నానమ్మలు ఎంత బాగున్నారో తెలుసా అంది సుజాత.
"ఇక అమెరికన్ ఎక్సప్రెస్ కంపెనీని బయటి నుంచి చూపించేసరికి దాని మీద గద్ద బొమ్మను చూసేసరికి సుజాతకు ఒక పాట గుర్తొచ్చింది. గోరటి ఎంకన్న రాసిన "గద్దోచ్చేరా..అమెరిక గద్దోచ్చేరా అనే పాటలోని గద్ద ఇదేనా అని అడిగేసరికి కాదు అమెరికన్ ఎక్సప్రెస్ కంపెనీ అన్నాడు రాకేష్. అంటే బొమ్మనేనా అని మళ్ళీ అడిగింది..అవును అంతే అని రాకేష్ అనేసరికి నిజమేనా..లేదా ఏదో చెప్పాలని నువ్వు చెప్తున్నావా అని సీరియస్ గా అడిగింది సుజాత. లేదు అంతే అన్నాడు రాకేష్. ఏమో తెల్వని దేశానికి తీసుకొచ్చి కుక్కను చూపించి నక్క అని చెప్పిన నమ్మే పరిస్థితి నాది" అని కౌంటర్ వేసింది.
"ఈ వాల్ స్ట్రీట్ లో స్టాక్ మార్కెట్ లో కనిపించే బుల్ ఇక్కడ సెలెబ్రిటీ అందుకే దాంతో చాలా మంది సెల్ఫీలు దిగుతూ ఉంటారు" అని చూపించింది సుజాత. అలాగే న్యూయార్క్ లో సన్ సెట్ చాలా అద్భుతంగా ఉంటుంది అంటూ దాన్ని కూడా చూపించాడు రాకేష్. "వరల్డ్ లో బిజీగా ఉన్న నగరం ఏదైనా ఉంది అంటే అది న్యూయార్క్ మాత్రమే.. ఈ ప్లేస్ ని చూడాలి అంటే నైట్ టైం చూస్తేనే దాని అందం తెలుస్తుంది" అని చెప్పారు. అలాగే అక్కడ సాయంత్ర సమయాల్లో జరిగే హంగామా మొత్తాన్ని చూపించారు. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ ఒరిజినల్ ఉంటే ఎలా ఉంటుందో కూడా చూపించారు.