English | Telugu
జాబ్ మానేసి కొత్త యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన శివజ్యోతి!
Updated : Mar 4, 2023
బిగ్ బాస్ లోకి వెళ్లొచ్చాక సెలబ్రిటీ లిస్ట్ లోకి చేరిపోయిన వారిలో శివజ్యోతి అలియాస్ తీన్మార్ సావిత్రి ఒకరు.. . ఫ్యాన్స్ అందరూ ప్రేమగా పిలుచుకునే పేరు జ్యోతక్క. మొదట టీవీ యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టిన శివ జ్యోతి.. యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని.. ఏకంగా బిగ్ బాస్ లో ఛాన్స్ కొట్టేసింది. మోస్ట్ ఎమోషనల్ గా సాగిన శివ జ్యోతి బిగ్ బాస్ జర్నీకి ప్రేక్షకులు బాగానే కనెక్ట్ అయ్యారనే చెప్పాలి. ఆ తర్వాత నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేనంతంగా శివ జ్యోతి ఫేట్ మారిపోయింది. వరుస ఆఫర్స్ ఈవెంట్స్ తో ఫుల్ బిజీ లైఫ్ గడుపుతుంది. ప్రతి పండుగ ఈవెంట్స్ లలో శివ జ్యోతి సందడి చేస్తుంది.
శివజ్యోతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తనకి సంబంధించిన ఎన్నో విషయాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేస్తుంది. రీసెంట్ గా జరిగిన తన పుట్టినరోజు వేడుకలను దుబాయ్ లో జరుపుకుంది. ఆ ఫొటోస్ ని షేర్ చేసింది. అయితే తాజాగా జాబ్ మానేసి 'జ్యోతక్క ముచ్చట్లు' పేరుతో కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది శివజ్యోతి. కాగా ఆ ఛానల్ ప్రమోషన్స్ ని భారీగా చేస్తోంది. సినిమా రేంజ్ లో ప్రమోషన్ ప్లాన్ చేసింది శివ జ్యోతి. ఆ ప్రమోషన్స్ ని అన్నింటిని తన ఛానెల్ లో "నా బలం మీరే నా బలగం మీరే "అనే కాప్షన్ తో అప్లోడ్ చేసింది.
శివజ్యోతి అప్లోడ్ చేసిన ఆ వీడియో చూసిన తన ఫ్యాన్స్.. "అల్ ది బెస్ట్ అక్క" అంటూ విష్ చేస్తున్నారు.. ఇప్పటికే శివజ్యోతి తన మాటతీరుతో ప్రేక్షకులకు దగ్గర అయింది. అయితే ఇప్పుడు కొత్త యూట్యూబ్ ఛానల్ తో వచ్చిన శివజ్యోతిని ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారో చూడాలి మరి!