English | Telugu
స్త్రీ సంగీతం లాంటిది.. స్త్రీ లేని రోజు లేదు!
Updated : Mar 4, 2023
సరిగమప ఛాంపియన్ షిప్ ఈవారం ఉమెన్స్ డే స్పెషల్ గా రాబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ షోకి సహజ నటి జయసుధ గారు ఎంట్రీ ఇచ్చారు. అలాగే "పులి-మేక" వెబ్ సిరీస్ టీమ్ నుంచి లావణ్య త్రిపాఠి, సిరి హన్మంత్, కోన వెంకట్ కూడా వచ్చారు. "విమెన్ అనేది సంగీతం లాంటిది..వితౌట్ విమెన్ దేర్ ఈజ్ నో డే" అని జయసుధ చెప్పారు. ఈ షోలో జడ్జి మనో కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే ఆయనకు వాళ్ల అమ్మ గుర్తొచ్చారట. " మా అమ్మ స్టేజి యాక్ట్రెస్..మా నాన్న హార్మోనియం వాయిస్తూ ఉంటారు. మా అమ్మ సత్యభామగా నటిస్తూ ఉంటే మా నాన్న హార్మోనియం వాయిస్తూ దాని మీద ఒక దిండు పెట్టి అక్కడ నన్ను పాడుకోబెట్టుకునేవారట..ఇలాంటి తల్లితండ్రులు ఎక్కడ దొరుకుతారు" అని అన్నారు.
ఇక పులి-మేక టీమ్ నుంచి లావణ్యతో "హ్యాపీ బర్త్డే సాంగ్" పాడించాడు యాంకర్ ప్రదీప్. దాంతో "ఎంత ఎదిగిపోయావమ్మా" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తర్వాత లావణ్య మాట్లాడుతూ "నాకు చాలా మంది చెప్పారు..ప్లీజ్ పాడొద్దు" అన్నారు. "వాళ్లెవరో కానీ చాలా మంచి మాట చెప్పారని" ఫన్ క్రియేట్ చేసాడు ప్రదీప్. ఇక రేణుకుమార్ తన కూతురు కోసం "ఆటల పాటల పుత్తడి బొమ్మరా" సాంగ్ పాడి అందరినీ మెస్మోరైజ్ చేసాడు. అతని సాంగ్ కి లావణ్య ఫిదా ఐపోయింది. "మీ వాయిస్ చాలా స్మూత్ గా తియ్యగా ఉంది" అంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. ఇక ప్రదీప్ రేణుకుమర్ కూతురు కోసం ఒక బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇలాంటి స్టేజి మా అమ్మకు విషెస్ చెప్పకపోతే ఇంటికెళ్ళాక నాకుంటుంది అంటూ ప్రదీప్ ఈ స్టేజి మీద నుంచి వాళ్ల అమ్మకు, అక్కకు ఉమెన్స్ డే విషెస్ చెప్పాడు.