English | Telugu

కొత్త వెబ్ సిరీస్ "స్టూడెంట్" స్టార్ట్....శివగా షణ్ముఖ్

యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ బుల్లితెర మీద, సోషల్ మీడియాలో మంచి ఫేమ్ తెచ్చుకున్న నటుడు. షన్ను ఎలాంటి వెబ్ సిరీస్ చేసినా అది యూత్ కు బాగా కనెక్ట్ ఐపోతుంది. అలాంటి షన్ను ఆహా సంస్థతో కలిసి ఏఏఎస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ గా అందరినీ మెప్పించి ఓటిటి ప్రపంచంలో కూడా తనదైన ముద్ర వేసేసుకున్నాడు. అలాంటి షన్ను లేటెస్ట్ గా కొత్త ప్రాజెక్ట్ తో రాబోతున్నట్లు తన ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు. "స్టూడెంట్" అనే కొత్త వెబ్ సిరీస్ ని స్టార్ట్ చేసినట్లు దాని షూటింగ్ కూడా స్టార్ట్ ఐనట్లు వెల్లడించాడు. ఇందులో రాఘవ, శివ, చక్రి అనే ముగ్గురు స్టూడెంట్స్ ఉంటారు. షన్ను ఇందులో శివ అనే స్టూడెంట్ గా నటిస్తున్నాడు.

ఈ త్రి క్యారెక్టర్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ కి గుర్తులు అని ఒక కాప్షన్ పెట్టుకున్నాడు. ఈ సిరీస్ లో శివగా నటిస్తుండడంతో ఇక నుంచి తన పేరు షన్ను కాదు శివ అని ఒక పోస్ట్ లో పెట్టుకున్నాడు. ఐతే ఈ సిరీస్ కి సంబంధించిన డీటెయిల్స్ గురించి ఇంకేమీ చెప్పలేదు. రీసెంట్ గా‘అయ్యయ్యో..’ అనే వీడియో సాంగ్ తో తన ఫాన్స్ ని అలరించాడు. షన్ను తన కెరీర్ మీద బాగా ఫోకస్ పెట్టేశాడు. ‘బిగ్ బాస్’ సీజన్ 5 లో షన్ను ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయ్యి బయటికి వచ్చాక తన సీన్ మొత్తం మారిపోయింది. దీప్తి బ్రేకప్ చెప్పేసింది. అలా వాళ్ళు ఎవరి దారిలో వాళ్ళు వెళ్తున్నారు. షన్ను మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.