English | Telugu

అడుగడుగునా ధరణిని అవమానిస్తున్న శైలేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -749 లో..శైలేంద్ర దగ్గరికి వెళ్లి భోజనానికి రండని పిలుస్తుంది ధరణి. నువ్వు వసుధారా క్లోజ్ గా ఉంటారా? గిఫ్ట్ తీసుకొచ్చాడా అని అడగమంటుంది ఏంటి? అయిన నేను వస్తానాని నాకోసం ఎదురుచూడని దానివి నువ్వు.. నీకు గిఫ్ట్ ఎందుకు తీసుకువస్తాను.. అయినా నీకు ఏం తీసుకొస్తాను.. నువ్వు ఒక అప్పలమ్మవి.. ఎప్పుడు ఇదే వాలకంలో ఉంటావ్? నిన్ను పూర్తిగా చూడాలని కూడా నాకనిపించదని శైలేంద్ర అనగానే.. ధరణి బాధపడుతూ వెళ్ళిపోతుంది.

ఆ తర్వాత అందరూ భోజనం చేస్తుండగా.. నీకోసం ధరణి ఎన్ని వంటలు చేసిందో చూడని శైలేంద్రతో మహేంద్ర అంటాడు. ఈ బెండకాయ నాకు ఇష్టముండదని శైలేంద్ర అంటాడు. నీకోసం ఎంతో ఇష్టంగా చేసిందని మహేంద్ర అనగానే.. బలవంతంగా మీకోసం వేసుకుంటానని‌ శైలేంద్ర చెప్పి.. ఆ కర్రీ వేసుకొని దానిని పక్కన పెట్టి మిగతాది తింటాడు. అదంతా గమనిస్తూ ధరణి బాధపడుతుంది. శైలేంద్ర హ్యాండ్ వాష్ చేసుకొని.. నీ ఇష్టాలను నా మీద రుద్దాలని చూడకంటూ.. తనపై కర్చీఫ్ ని వేసి వెళ్తాడు. వాళ్లిద్దరినే అబ్ సర్వ్ చేస్తూ ఉంటుంది వసుధార. ఆ తర్వాత ధరణి దగ్గరికి జగతి వచ్చి.. వంటలు బాగున్నాయని మెచ్చుకున్నాడా అని అడుగుతుంది. అయిష్టంగానే 'హ అవును' అని ధరణి అంటుంది. అప్పడే జగతి దగ్గరికి వసుధార వచ్చి.. ధరణితో శైలేంద్ర ఏమో అంటున్నాడని అనగానే.. అప్పుడే దేవయాని వస్తుంది. నిన్ను నా ఇంట్లో ఉండనివ్వడమే ఎక్కువ.. అనవసరంగా నా కొడుకు కోడలు విషయంలో కలుగజేసుకోకు.. అయినా నా కొడుకుని దారిలో తిట్టావట అంటూ వసుధారని కోప్పడుతుంది దేవయాని. మీ కొడుకు కదా మేడం.. మీ బుద్దులే వస్తాయంటూ వసుధార అంటుంది. నువ్వు ఎక్కువగా మాట్లాడుతూన్నావని దేవయాని అంటుంది. ఇంతలోనే వసుధర అంటూ రిషి పిలుస్తాడు. మన మధ్య జరిగింది రిషిమి చెప్తావా అని దేవయాని అనగా.. చెప్పేదాన్నయితే ఎప్పుడో చెప్పేదాన్ని.. రిషి సర్ తనంతట తానే తెలుసుకోవాలని చెప్పేసి వసుధార అక్కడ నుండి వెళ్ళిపోతుంది. వసుధార కోసం రిషి చూస్తుంటే.. శైలేంద్ర వచ్చి రిషీతో కూర్చొని మాట్లాడుతాడు. నీ ప్రేమ గురించి చెప్పమని శైలేంద్ర అనగానే.. ప్రేమ గురించి గొప్పగా చెప్తాడు రిషి. ఇక కాసేపటికి వసుధారతో మాట్లాడాలని రిషి పైకి వెళ్తాడు.

రిషి, వసుధారలు మాట్లాడుకుంటారు. శైలేంద్ర గురించి వసుధార ఏదో చెప్తుండగా.. శైలేంద్ర గురించి మంచిగా చెప్తుంటాడు రిషి. మా పెద్దమ్మ నన్ను మా అన్నయ్యని ఒకేలా పెంచింది.. అన్నయ్య మంచివాడంటూ వసుధారకి చెప్తాడు రిషి. ఆ తర్వాత ధరణి దగ్గరికి దేవయాని వచ్చి.. నీ భర్త గురించి పట్టించుకోవడం లేదా? కాఫీ తీసుకొని రా.. నేను ఇస్తానని దేవయాని అంటుంది. ఇక ఇదంతా గమనించిన జగతి.. ఏం మనిషో ఏమో అని దేవయానిని ఉద్దేశించి అంటుంది. వెంటనే తన మనసులో ఉన్న దుఃఖాన్ని ఆపుకోలేక జగతి మీద పడి ఏడుస్తుంది ధరణి. ఎమోషనల్ గా ఉంటుంది జగతి ఓదార్చే సీన్.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.