English | Telugu

నిధులు దుర్వినియోగం చేసాడని రిషిపై అభియోగం.‌. శైలేంద్ర ప్లాన్ సక్సెస్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌-769లో.. రిషిని వసుధార కాలేజ్ లోపలికి తీసుకెళ్తుంది. బయట ఉన్న జగతితో శైలేంద్ర మాట్లాడతాడు. ఇకమీద జాగ్రత్తగా చూసుకో రిషిని.. నాకు మూడు రోజుల్లో కాలేజ్ కావాలి.. రిషిని ఎక్కడికైన పంపిచేసేయ్ అని జగతితో శైలేంద్ర చెప్తాడు. ఆ తర్వాత రిషి దగ్గరికి జగతి వచ్చి.. నీకేం కాలేదు కదా రిషి అని ఏడుస్తుంది.

జగతి అలా ఏడ్వడటం చూసిన రిషి.. నాకేం కాలేదని చెప్పి ఓదారుస్తాడు. రిషి సర్ ని నేను చూసుకుంటాను.. మీరు వెళ్ళండని వసుధార నచ్చజెప్పి జగతిని పంపించేస్తుంది. ఆ తర్వాత వసుధారకి రిషి మిషన్ ఎడ్యుకేషన్ గురించి మెడికల్ కాలేజ్ గురించి కొన్ని విషయాలు చెప్తాడు. అప్పుడు మేనేజర్ వచ్చి.. కాంట్రాక్టర్ కి డబ్బులు ఇవ్వాలి సర్ అని రిషిని అడుగగా.. మనీ తక్కువగా ఉన్నాయి.. నేనే ఏర్పాటు చేస్తానని చెప్పగా ఆ మేనేజర్ వెళ్తాడు.

అలా మేనేజర్ బయటకు వెళ్తుంటే శైలేంద్ర లోపలికి వస్తాడు. అతడిని చూసి మేనేజర్ ఎందుకు వచ్చాడని రిషిని శైలేంద్ర అడుగుతాడు. మనీ కోసం వచ్చాడు. నా దగ్గర మనీ తక్కువ ఉన్నాయని రిషి చెప్తాడు. మరి నేను ఇస్తాను డబ్బులు.. మన కాలేజే కదా అని శైలేంద్ర అనగా.. వద్దని రిషి అంటాడు. ఆ తర్వాత రిషి కొన్ని డిటేల్స్ చేప్తూ వసుధారని నోట్ చేసుకోమని చెప్తాడు. అలా వారిద్దరు మాటల్లో ఉండగా.. అక్కడే టేబుల్ మీద మిషన్ ఎడ్యుకేషన్ చెక్ బుక్ ఉండగా.. వారిద్దరికి తెలియకుండా అందులో నుండి ఒక చెక్ కాజేస్తాడు శైలేంద్ర. అలా కాజేసిన చెక్ ని సారథికి ఇస్తాడు.

శైలేంద్ర ఆ చెక్ ని తీసుకెళ్ళి నేను చెప్పినట్టు చేయు.. ఈ పని జరుగలేదంట నీకు భూమి మీద నూకలు చెల్లిపోతాయని శైలేంద్ర అనగా‌‌.. తప్పులు చేయడంలో ఈ సారథి ఎక్స్పర్ట్ శైలేంద్ర.. మీరు చెప్పినట్టే చేస్తానని సారథి అంటాడు. ఆ తర్వాత సారథి ఆ చెక్ ని తీసుకొని మినిస్టర్ దగ్గరికి వెళ్తాడు. మినిస్టర్ గారితో రిషి వ్యక్తిత్వం ఎలాంటిదని సారథి అడుగుతాడు. మంచి వ్యక్తిత్వం, తప్పు అసలే చేయడని మినిస్టర్ అంటాడు. తప్పు చేసాడు సర్ రిషి అని సారథి అనగానే.. ఏం మాట్లాడుతున్నావ్? నువ్వు ఫస్ట్ బయటకు వెళ్ళని మినిస్టర్ అంటాడు. మీరు నమ్మరని నాకు తెలుసు సర్ అందుకే ఆధారాలతో వచ్చానని ఆ చెక్ ని ఇస్తాడు. అది చూసిన మినిస్టర్ ఇందులో తప్పేముందని అంటాడు.

మిషన్ ఎడ్యుకేషన్ చెక్ ని మెడికల్ కాలేజ్ పనుల కోసం అడ్వాన్స్‌ గా రిషి నాకిచ్చాడని సారథి అంటాడు. ఇది నేను నమ్మనని మినిస్టర్ అంటాడు. క్లారిటి కోసం వసుధరాకి కాల్ చేస్తాడు మినిస్టర్. మీ ఇద్దరి సంతకాలతో ఒక చెక్ నా దగ్గరికొచ్చింది.. రిషి నిధులు దుర్వినియోగం చేసాడనే అభియోగం వచ్చింది అని అనగానే.. రిషి సర్ అలా ఎప్పుడు చేయడని చెప్తుంది వసుధార. నువ్వు జగతి నా ఆఫీస్ కి రండి అని మినిస్టర్ చెప్తాడు. సరేనని వసుధార చెప్పి.. జగతికి ఇలా జరిగిందంట అని చెప్పగానే.. వసుధార ఎందుకిలా చేసావ్? రిషి ఎప్పుడు ఆ తప్పు చేయడు నువ్వే ఆ చెక్ ని ఇష్యూ చేసావని శైలేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.