English | Telugu

శ్రీముఖి బ్యాంకాంక్ టూర్ డే-1 

శ్రీముఖి.. టెలివిజన్ రంగంలో యాంకరింగ్ తో తన సత్తా చాటుతుంది. టీవీ రంగంలోనే కాకుండా సినిమాలల్లో కూడా నటిస్తుంది శ్రీముఖి. బిగ్ బాస్ సీజన్-3 లో రన్నరప్ గా నిలిచింది. బిగ్ బాస్ షోలో టాస్క్ లు ఫినిష్ చేసి వహ్వా అనిపించుకుంది. బిగ్ బాస్ నుండి బయటకొచ్చాక సినిమాలల్లో వరుస ఆఫర్స్ తో బిజీ అయింది శ్రీముఖి.

జులాయి సినిమాలో అల్లు అర్జున్ కి చెల్లెలు పాత్రలో కనిపించిన శ్రీముఖి.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిబి జోడీలో యాంకర్ గా చేసిన శ్రీముఖి పలు టీవి షోస్ , ఆడియో ఫంక్షన్స్ చేసి గుర్తింపు తెచ్చుకుంటుంది. అయితే తన హాట్ ఫోటోస్ ని ఈ మధ్య తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా అవి కాస్త వైరల్ గా మారాయి. అయితే తనకి సంబంధించిన ప్రతీ అప్డేట్ ని అటు యూట్యూబ్ లో వ్లాగ్ లుగా చేసి అప్లోడ్ చేస్తుంది. ఇటు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లు చేస్తూ ఫ్యాన్స్ కి ఎప్పుడు దగ్గరగా ఉంటుంది. అయితే థాయ్ లాండ్ లో సమ్మర్ వెకేషన్ అంటూ తాజాగా రిలీజ్ చేసిన ఒక వీడియోలో తను ఒక అబ్బాయితో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే తనకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని, అతనిని పెళ్ళి చేసుకోవడానికే బ్యాంకాక్ వెళ్ళిందనే వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. అయితే ఇందులో నిజం ఎంతుందో తెలియాల్సి ఉంది.

అయితే శ్రీముఖి తన పుట్టిన రోజుని సెలబ్రేట్ చేసుకోవడానికి థాయ్ లాండ్ వెళ్ళింది. అక్కడ ఒక హోటల్ రూం తీసుకొని తన జర్నీ అంతా ఒక వ్లాగ్ చేసింది. అక్కడ బయట ఫుడ్ ఎలా ఉంటుందో చూపించిన శ్రీముఖి.. మన ఇండియాలో తప్ప ఇంకెక్కడా మనం తినలేమని అంది. అక్కడ ఒక షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసిన శ్రీముఖి వాటన్నింటినీ చూపించింది. ఇదంతా శ్రీముఖి బ్యాంకాంక్ టూర్ డే-1 పేరిట వ్లాగ్ చేసి తన యూట్యూబ్ చానెల్ లో అప్లోడ్ చేసింది. కాగా ఈ వీడియోకి మంచి వీక్షకాదరణ లభిస్తోంది. తన అభిమానులు కామెంట్లలో బర్త్ డే విషెస్ చెప్తున్నారు. ఇప్పుడు శ్రీముఖి చేసిన ఈ వీడియో వైరల్ గా మారింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.