English | Telugu

న‌మ్మించి 4 కోట్లు మోసం చేశాడు.. భోరుమ‌న్న‌ జ‌య‌ల‌లిత‌

'లారీడ్రైవ‌ర్‌' చిత్రంలో బోరింగు పాప పాత్ర‌లో న‌టించి పాపుల‌ర్ అయ్యారు న‌టి జ‌య‌ల‌లిత‌. అంత‌కు ముందు వంశీ 'ఏప్రిల్ 1 విడుద‌ల‌' చిత్రంలో భాగ్యంగానూ క‌నిపించి ఆక‌ట్టుకున్న ఆమె ఆ త‌రువాత వ్యాంప్‌ త‌ర‌హా పాత్ర‌ల్లో ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం సినిమాల్లో అర‌కొర‌గా క‌నిపిస్తున్న జ‌య‌ల‌లిత బుల్లితెర సీరియ‌ల్స్‌లో ఆక‌ట్టుకుంటున్నారు.

'బొమ్మ‌రిల్లు' శ్రీ‌రామ్‌ న‌టిస్తూ నిర్మిస్తున్న 'ప్రేమ ఎంత మ‌ధురం' సీరియ‌ల్‌లో త‌ల్లి పాత్ర‌లో హుందాగా క‌నిపిస్తూ త‌న అభిన‌యంతో అల‌రిస్తున్నారు. గ‌త 35 ఏళ్లుగా ఇండ‌స్ట్రీలో న‌టిగా కొన‌సాగుతున్న ఆమె వినోద్‌కుమార్ అనే వ్య‌క్తిని పెళ్లాడి దారుణంగా మోస‌పోయారు. రెండేళ్ల క్రితం కొంత మందిని న‌మ్మి 4 కోట్లు పోగొట్టుకున్నారు. ఇదే విష‌యాన్ని అలీ వ్యాఖ్యాత‌గా వ్య‌వహ‌రిస్తున్న 'ఆలీతో స‌ర‌దాగా' షోలో వెల్ల‌డించారు.

"వాళ్లు విజ‌య‌న‌గ‌రం రాజులు.. జీఎస్టీలు క‌ట్ట‌లేక‌పోతున్నాం. సీరియ‌ల్స్ చేయ‌డం క‌ష్టంగా వుంది అంటే నేను వాళ్ల‌ని గుడ్డిగా న‌మ్మేశా. నా ద‌గ్గ‌ర వున్న డ‌బ్బుతో మీరు చేసుకోండి.. నాకు షేర్ ఏమీ వ‌ద్దు అని చెప్పి వాళ్ల‌కు డ‌బ్బులు ఇవ్వ‌డం మొద‌లుపెట్టా.. అలా కొంత కాలం గ‌డిచాక 2018 డిసెంబ‌ర్ నాటికి నాద‌గ్గ‌ర 4 కోట్ల రూపాయ‌ల‌ వ‌ర‌కు డ‌బ్బులు వ‌సూలు చేసి వాడు చేతులెత్తేసి వెళ్లిపోయాడు. ఇప్పుడు నేను కారు లేక క్యాబ్‌ల‌లో తిరుగుతున్నాను. ఓ వ్య‌క్తిని న‌మ్మి మోస‌పోయాను." అని భావోద్వేగానికి లోనై భోరుమ‌న్నారు. ఆమెను మ‌రో న‌టి వ‌ర‌ల‌క్ష్మి ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట సంద‌డి చేస్తోంది.

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు.

Brahmamudi: రాజ్ తీసిన యాడ్ సక్సెస్.. ధాన్యలక్ష్మి ఇచ్చిన బిగ్ ట్విస్ట్ అదే!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -911 లో..... అప్పు ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఒకావిడని రౌడీలు వెంబడిస్తారు. అప్పుని చూసి ఆవిడ దగ్గరికి వచ్చి.. మేడం కాపాడండి అంటుంది. రౌడీలు పోలీసులని చూసి పారిపోతారు. మేడమ్ వాళ్ళు నా నగలు దొంగతనం చెయ్యాలని వెంబడిస్తున్నారని చెప్తుంది. దాంతో వాళ్ళని పట్టుకోమని కానిస్టేబుల్ కి చెప్తుంది అప్పు. చాలా థాంక్స్ మేడమ్ అని ఆవిడ చెప్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళాలి నేను డ్రాప్ చేస్తానని అప్పు అంటుంది. ఆవిడ ఇంటిముందు దింపుతుంది...

Illu illalu pillalu : ఇంగ్లీష్ టీచర్ గా సెలెక్ట్ అయిన శ్రీవల్లి బయటపడుతుందా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -349 లో..... ప్రేమ, నర్మద కలిసి డుప్లికేట్ డాక్టర్ ని తీసుకొని వచ్చి శ్రీవల్లిని భయపెడతారు. నీకు జ్వరం తగ్గింది కదా అక్క ఇక ఇంటర్వ్యూకి వెళదామని ఇద్దరు దగ్గరుండి మరి ఇంటర్వ్యూ కోసం స్కూల్ కి తీసుకొని వెళ్తారు. శ్రీవల్లి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి తన సర్టిఫికెట్లు ఇస్తుంది. టెల్ మీ యువర్ సెల్ఫ్ అని ప్రిన్సిపల్ అనగానే శ్రీవల్లికి ఏం చెయ్యాలో అర్థం కాదు. అసలు మీకు ఇంగ్లీష్ వచ్చా రాదా అని ప్రిన్సిపల్ అడుగుతాడు.