English | Telugu
శ్రీహాన్-సిరితో కలిసి వెబ్ సిరీస్... హిట్ పెయిర్ తో గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న శేఖర్ మాస్టర్!
Updated : Dec 27, 2022
బిగ్ బాస్ సీజన్ 6 రన్నర్ శ్రీహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. టైటిల్ విన్నర్ కావాల్సిన శ్రీహాన్ ని బిగ్ బాస్ టీమ్ ట్రాప్ చేసి ఆ కప్ రేవంత్ కి దక్కేలా చేశారు. మళ్ళీ ఫైనల్ ట్విస్ట్ గా రేవంత్ కంటే శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు పడ్డాయని చెప్పారు. ఏదేమైనా సీజన్ పూర్తయ్యింది. ఇప్పుడు శ్రీహాన్ కి ఇండస్ట్రీ నుంచి మంచి అవకాశాలు రావడం మొదలయ్యింది. నటుడిగా బిజీ అవుతున్నాడు. శ్రీహాన్-సిరి కాంబినేషన్ లో స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఒక వెబ్ సిరీస్ ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు.
బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనే టఫ్ కంటెస్టెంట్ గా శ్రీహాన్ ఫేమ్ తెచ్చుకున్నాడు. మొదట్లో కొన్ని వెబ్ సిరీస్ లో సిరితో నటించి పేరు తెచ్చుకున్నాడు. సిరి హన్మంత్ బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్.. ఈ జంటకు సోషల్ మీడియాలో మంచి హిట్ పెయిర్ గా గుర్తింపు ఉంది. శేఖర్ మాస్టర్ ఇప్పుడు వాళ్ళ క్రేజ్ ని ఉపయోగించుకోవడానికి కొత్త వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నారు.
త్వరలోనే వెబ్ సీరీస్ ను ఎనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కొరియోగ్రాఫర్ గా డాన్స్ షోస్ తో గుర్తింపు తెచ్చుకున్న శేఖర్ మాస్టర్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారబోతున్నాడు.