English | Telugu

శేఖర్ మాస్టర్ రాకతో బిబి జోడీలో పూనకాలు లోడింగ్!

ప్రతీ శని, ఆదివారాల్లో స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న డ్యాన్స్ షో 'బిబి జోడి'. గతవారం సెమీఫైనల్‌ నుండి ఒక జోడీ ఎలిమినేట్ అయి బయటకు రాగా మిగిలిన ఐదు జోడీలతో 'గ్రాండ్ ఫినాలే' చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయింది. శ్రీముఖి యాంకర్ గా సదా, తరుణ్ మాస్టర్, రాధ జడ్డెస్ గా చేస్తున్న ఈ డ్యాన్స్ షో ఇప్పుడు అత్యంత వీక్షకాదరణ పొందుతోంది.

శనివారం రోజు జరిగిన ఎపిసోడ్ లో శేఖర్ మాస్టర్ గెస్ట్ గా వచ్చి.. పూనకాలు లోడింగ్ పాటకు తన డ్యాన్స్ తో అందరికి మంచి కిక్కు ఇచ్చాడు.‌ తన ఫస్ట్ మూవీ తరుణ్ మాస్టర్ తో చేసానని శేఖర్ మాస్టర్ చెప్పాడు. వంద రూపాయల నుండి ఇప్పటిదాకా వచ్చారు గ్రేట్ అని తరుణ్ మాస్టర్ చెప్పాడు. సదాని చూస్తుంటే ఏం గుర్తురావట్లేదా మాస్టర్ అని శ్రీముఖి అడుగగా.. అదేం లేదని, తను చాలా మంచిదని.. అప్పుడు తను ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందని శేఖర్ మాస్టర్ చెప్పాడు. రాధ, శేఖర్ మాస్టర్ కలిసి 'శుభలేఖ రాసుకున్న ఎదలో ఎపుడో' పాటకి డ్యాన్స్ చేసారు. అలా ఇద్దరు డ్యాన్స్ చేసాక ఇప్పటి జనరేషన్ తో కలిసి డ్యాన్స్ చేయలేకపోతున్నానే ఒక చిన్న డ్రీమ్ ఉండిపోయింది.. అది ఇప్పుడు తీరిపోయిందని రాధ చెప్పింది.

"అవినాష్-అరియానా డ్యాన్స్ అదుర్స్.. సూపర్బ్. హాఫ్ బీట్ పట్టుకొని వచ్చావ్ ఇప్పుడు ఫుల్ బీట్ లో చేస్తున్నావ్ అరియానా, ఆ తర్వాత మరొక జోడి గురించి చెప్పాలి.. ఒక హాట్ పర్ఫామెన్స్.. బాహుబలి మూవీలోని పాటకి మెహబూబ్-శ్రీసత్య పర్ఫామెన్స్ చూసి వావ్ అనిపించింది. ఫైమా-సూర్య బాగా కష్టపడుతున్నారు. ఫైమాని చూసి ఎవరైనా డ్యాన్సర్ అనుకుంటారా? ఫైమాని చాలా దగ్గర నుండి చూసాను. కామెడీ బాగా చేసి అందరిని బాగా నవ్విస్తుంది. కానీ డ్యాన్స్ మాత్రం ఇరగదీస్తుంది ఇప్పుడు. ఎలాగైనా బెస్ట్ డ్యాన్స్ ఇవ్వాలని చాలా కష్టపడుతున్నావ్. ఇక్కడ ఉన్న అన్ని జోడీలలో కాస్ట్లీ కంటెస్టెంట్స్ ఎవరైనా ఉన్నారంటే అది మీరే చైతు-కాజల్ జోడి, మూడు సార్లు ఎలిమినేషన్ దాకా వెళ్ళి గెలిచి వచ్చారు" అని శేఖర్ మాస్టర్ చెప్పాడు.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.