English | Telugu

అల్లు అర్జున్ పోస్ట్ చేసినా నమ్మకండని చెప్పిన‌ గీతు రాయల్!

బిగ్ బాస్ సీజన్-6 తో గీతు రాయల్ ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ లో‌ తన గేమ్ స్ట్రాటజీతో అందరిని తికమక పెడుతూ పర్ఫామెన్స్ చేసేది. మైండ్ గేమ్ తో ఎక్కువ మంది కంటెస్టెంట్స్ మనసులని గాయపరిచిన ఈ చిత్తూరు చిరుత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని పొందింది. బిగ్ బాస్ కి ముందు రివ్యూ లు చెప్పే గీతు.. నిన్న మొన్నటిదాకా నీతి సూక్తులు, మోటివేషనల్ కోట్స్ చెప్తూ సమాజానికి మెసెజ్ లు‌ ఇచ్చింది.‌

ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు పోస్ట్ లు చేస్తూ తన ఫ్యాన్స్ కి దగ్గరగా ఉండే గీతు రాయల్.. ఉగాదిని వాళ్ళ‌ ఇంట్లో ఎలా జరుపుకుంటారో వీడియోని యూట్యూబ్ లో‌ రిలీజ్ చేసింది. అలా ప్రతీది తనకి ఏదనిపిస్తే అది చేయడం తన సహజ గుణమని ఎప్పుడు చెప్తుంది‌ గీతు. బిగ్ బాస్ లో ఉన్నన్ని రోజులు ఆదిరెడ్డి తో మంచి ఫ్రెండ్ గా ఉంది గీతు. ఆ తర్వాత అందరిని కలుస్తూ సర్ ప్రైజ్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఆమె ఒక స్టేటస్ పెట్టగా.. ఇప్పుడు అది హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేసింది. "ఇన్ స్టాగ్రామ్ లో ఎవరైనా ట్రేడింగ్ లేదా క్రిప్టో లేదా బెట్టింగ్ గురించి ఏ పోస్ట్ చేసి‌నా దయచేసి నమ్మకండి. నేను పోస్ట్ చేస్తే కూడా నమ్మకండి. నేను కొన్ని ఆర్గనైజేషన్స్ కి ఇచ్చిన కమిట్ మెంట్ వల్ల పోస్ట్ చేయాల్సి వస్తుంది. కానీ ఏదో పెట్టారని చేయకండి. డబ్బులు పోతే వాళ్ళు భాద్యత తీసుకోరు. ఇదే విషయం గురించి ఒకవేళ అల్లు అర్జున్ పోస్ట్ చేసినా నమ్మకండి" అంటూ గీతు తన ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో రాసుకొచ్చింది. కాగా ఇప్పుడు ఇది వైరల్ గా మారింది. తనకేమి అనిపిస్తే అది చెప్పే గీతు ఈ విషయాన్ని సూటిగా చెప్పేసింది. దీంతో నెటిజన్లు తమ స్పందనలను తెలియజేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.