Read more!

English | Telugu

జ్యోతక్క ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం

కొత్త ఏడాది ఇలా మొదలయ్యిందో లేదో బుల్లితెర స్టార్స్, యూట్యూబర్స్ అంతా కొత్త కొత్త ముచ్చట్లు చెప్తున్నారు. కార్లు, బైక్లు, ఇళ్ళు కొనుక్కుంటున్నారు..ఇప్పుడు జ్యోతక్క కూడా  కొత్త ఇంట్లోకి అడుగుపెట్టింది. దానికి సంబంధించిన ఒక వీడియోని తన యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. 

రీసెంట్ ఆమె తన అత్తారింటికి సంబంధించిన ఒక వీడియోని పోస్ట్ చేసి ఆ ఇంటి ఇంటీరియర్ మొత్తం కూడా పాడైపోయింది అని చెప్పి బాధపడింది. ఇప్పుడు ఆ ఇల్లు మొత్తాన్ని మళ్ళీ ఫ్రెష్ గా రెనోవేషన్ చేయించి ఆ ఇంట్లోకి మళ్ళీ గృహప్రవేశం చేశారు జ్యోతక్క అండ్ ఫామిలీ.. ఈ సందర్భంగా ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని వీడియో తీయించింది శివజ్యోతి. ఇంటికి వచ్చిన ముత్తైదువులు కాళ్లకు పసుపు రాయడం వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం మొత్తం చూపించింది. ఇంట్లో పూజ కార్యక్రమం మొత్తం పూర్తయ్యాక దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లారు. 

తర్వాత జ్యోతక్క ఫేవరేట్ దేవుడు వెంకటేశ్వర స్వామి గుడికి కూడా వెళ్లారు. తీన్మార్ వార్తలతో  ఫేమస్ ఐన శివ జ్యోతి తెలంగాణ యాసలో మాట్లాడుతూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. తర్వాత బిగ్ బాస్ కి వెళ్లి ఫుల్ ఎంటర్టైన్ చేసింది.  జ్యోతక్కకు ఏమాత్రం ఖాళీ దొరికినా తన భర్తతో కలిసి ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళిపోతుంది..అక్కడి వీడియోస్ ని కూడా అప్ డేట్ చేస్తూ ఉంటుంది.