English | Telugu

మా ప్రేమ కథలో ఒక ఏడాది గడిచిపోయింది!

సింగర్ రేవంత్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. ఇప్పుడు రేవంత్ తన ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీని భార్య అన్వితతో కలిసి గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నాడు. వాళ్ళు కలిసి దిగిన పిక్స్ తో తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసాడు. రేవంత్ బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 కంటెస్టెంట్స్‌లో ఒకరు. బిగ్‌బాస్‌ హౌస్ లోకి వెళ్లే టైంకి అన్విత ప్రెగ్నెంట్ అనే విష‌యాన్ని రేవంత్ చెప్పాడు. ఈ టైంలో భార్య‌కు అండ‌గా నిల‌బ‌డాల్సిన స‌మ‌యంలో ఆమెకు దూరంగా ఉన్నానంటూ చాలా సార్లు హౌస్ లో ఎమోష‌న‌ల్ అయ్యాడు.

తర్వాత అన్విత సీమంతం వేడుక‌ల‌ను బిగ్‌బాస్ హౌజ్‌లో నిర్వ‌హించారు. ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 9 విన్న‌ర్‌గా నిల‌వ‌డంతో ఆయన టాలెంట్ లైం లైట్ లోకి వ‌చ్చింది. బాహుబ‌లి, అర్జున్‌రెడ్డి, గీతాగోవిందంతో పాటు ప‌లు సినిమాల్లో పాట‌లు పాడాడు రేవంత్‌. ఎవ్రీ స్టోరీ ఈజ్ ఏ లవ్ స్టోరీ అని ఫోటో టైటిల్ పెట్టుకున్నాడు. " మా ప్రేమ కథలో ఒక సంవత్సరం వెళ్ళిపోయింది. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు నా ప్రియతమా" అని కాప్షన్ పెట్టాడు రేవంత్. బిగ్ బాస్ హౌస్ ఉన్నన్ని రోజులు చాలామంది కంటెస్టెంట్స్ రేవంత్ కి నెగటివ్ గా ఉండేవాళ్ళు. ఎందుకంటే రేవంత్ మాట్లాడే విధానం అగ్రెసివ్ గా ఉంటుందని తాను చెప్పేదే కరెక్ట్ అనుకుంటాడని ఎన్నో కారణాలు చెప్పారు. కానీ ఫైనల్ గా టైటిల్ మాత్రం రేవంత్ విన్ అయ్యాడు.

ఇక రేవంత్ కి నెటిజన్స్ అంతా "హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ" అని కామెంట్స్ లో విష్ చేశారు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.