English | Telugu
ఇంతకు నేనెవరు ?
Updated : Jun 11, 2022
సాకేత్ కొమండూరి ఫేమస్ సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు సరిగమప సింగింగ్ షోలోని కంటెస్టెంట్స్ కి మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. ఐతే ఒక పక్క కెరీర్ ని ఎంజాయ్ చేస్తూ మరో వైపు ఖాళీ దొరికితే కొన్ని స్పెషల్ వీడియోస్ చేస్తూ తన ఫాన్స్ తో అటాచ్మెంట్ పెంచుకుంటున్నాడు. ఐతే ఇప్పుడు ఒక ప్రత్యేక వీడియో చేసాడు. తన భార్యకి, చెల్లెలికి మధ్య డిబేట్ పెట్టాడు.
ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ తన గురుంచి తెలుసు అంటూ పరీక్ష పెట్టాడు. ఇంతకు తన అసలు పేరేమిటి ? ఏ వయసులో ఫస్ట్ స్టేజి షో చేసాడు ? అన్ని కామెడీ షోస్ లోకి ఏ షో అంటే ఇష్టం ? బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ? ఒక మనిషిలో నచ్చని క్వాలిటీ ఏమిటి ? అంటూ తన గురుంచి తానె ప్రశ్నలు ప్రిపేర్ చేసుకుని సాకేత్ భార్య పూజితతో చెల్లెలి సోనీతో చిన్న గేమ్ ఆడించాడు. చివరికి ఇద్దరికీ సమానమైన మార్కులు వచ్చేసరికి సాకేత్ వాళ్ళిద్దరి ఫ్రెండ్ షిప్ గురుంచి చెప్పుకొచ్చాడు. ఇద్దరికీ మంచి అండర్ స్టాండింగ్ ఉందని , చాలా విషయాల్లో ఇద్దరికీ బాగా సింక్ అవుతుంది అని చెప్పాడు. తాను ఒకప్పుడు సరైన దారిలో లేనప్పుడు భార్య చెల్లి ఇద్దరూ కలిసి తనని మార్చారని తన పాత లైఫ్ గురుంచి కూడా చెప్పాడు సాకేత్. ఇక ఈ వీడియో బాగుంది , ప్రాంక్ వీడియోస్ కూడా చేయండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.