English | Telugu
రుద్రాణికి చుక్కలు చూపించిన మాధురి!
Updated : Dec 29, 2021
బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న సీరియల్ లలో ముందు వరుసలో నిలుస్తోంది `కార్తీక దీపం`. పరిటాల నిరుపమ్ నటించిన ఈ సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. బుధవారం ఎపిసోడ్ లో శ్రీవల్లి బాబు నామకరణం జరుగుతుండగా ఇంట్లో కి చొరబడిన రుద్రాణి..నామకరణం ఆపేసి శ్రీవల్లి బాబుని బలవంతంగా ఎత్తుకెళ్లడం తెలిసిందే. దీంతో తల్లడిల్లిన శ్రీవల్లి ఏది జరిగితే అది జరిగిందని తనపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందేనని కోటేష్‌ని వెంటబెట్టుకుని పోలిస్ స్టేషన్ వెళుతుంది.
కట్ చేస్తే గురువారం ఎపిసోడ్ మరింత రసవత్తరంగా మారబోతోంది. డాక్టర్ బాబు.. తనతో రుద్రాణి అన్న మాటల గురించి ఆలోచిస్తుంటాడు. ఇంతలో దీప వచ్చి ఏంటీ డాక్టర్ బాబు ఆలోచిస్తున్నారంటుంది. రుద్రాణి గురించి దీప అని చెబుతాడు. ఆ తరువాత `తన విషయంలో తప్పు చేశానేమోనని'.. అంటూ ఫీలవుతుంటాడు. దీనికి దీప `మంచో చెడో అయిపోయిన దాని గురించి ఆలోచిస్తే.. ఏమోస్తుంది చెప్పండి తలనొప్పి తప్ప అని డాక్టర్ బాబుకు సర్ది చెబుతుంది.
కట్ చేస్తే రుద్రాణి ఇంటి ముందు పోలీస్ వ్యాన్ వచ్చి ఆగుటుంది. సౌండ్ విన్న రుద్రాణి.. 'ఒరేయ్ అబ్బులు ఆ సౌండ్ ఏంటో చూడు' అంటుంది. అది గమనించిన అబ్బులు 'అక్కా.. అక్కా.. పోలీసులు వస్తున్నారక్కా..' అంటూ కంగారుగా చెబుతాడు.. `ఏంట్రా మధ్యాహ్నమే మందు కొట్టి వచ్చావా?..ఈ రుద్రాణి ఇంటి మీద పోలీసుల నీడ కూడా పడలేదురా?.. నిజంగా వస్తున్నారక్కా..' అంటుండగానే ఎస్.ఐ. మాధురి సరాసరి రుద్రాణి ముందుకే వచ్చేస్తుంది.
Also Read:రాత్రివేళ ఒంటరిగా కారులో అను ఎక్కడికి వెళ్లింది?
'ఏంటీ నీ ధైర్యం?' అని రుద్రాణి.. మాధురిని ప్రశ్నిస్తుంది.. ధైర్యం నా ఇంటిపేరు అనుకో రుద్రాణి అని బదులిస్తుంది మాధురి. వెంటనే శ్రీవల్లి, కోటేష్ కూడా లోపలికి వచ్చేస్తారు. వీడు మా బాబు అంటూ బాబుని చూపిస్తారు. వారిని బెదిరించే ప్రయత్నం చేస్తుంది రుద్రాణి..ఈ సంభాషణ గమనించిన మాధురి.. వెంటనే రుద్రాణి చెంప ఛెల్లుమనిపిస్తుంది.. ఓ విధంగా చెప్పాలంటే రుద్రాణికి చుక్కలు చూపిస్తుంది.. ఆ తరువాత ఏం జరిగింది? .. కథ ఎలాంటి మలుపులు తిరిగింది? అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.