English | Telugu
బాబుని ఎత్తుకెళ్లిన రుద్రాణి.. శ్రీవల్లి రియాక్షన్ ఏంటీ?
Updated : Dec 29, 2021
బుల్లితెరపై మహిళా ప్రేక్షకుల నీరాజనాలందుకుంటున్న ఏకైకసీరియల్ `కార్తీక దీపం`. దివంగత రచయిత ఓంకార్ తనయుడు పరిటాల నిరుపమ్, ప్రేమి విశ్వనాథ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.గఎంతో కాలంగా ఈ సీరియల్ మహిళా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. డాక్టర్ బాబుని రత్నసీత సాయంతో ఓ కేసులో ఇరికించి డాక్టర్ వృత్తికే దూరం చేస్తుంది మోనిత. అయితే తన కొడుకు కోసం మాస్టర్ ప్లాన్ వేసిన సౌందర్య ఆ విషయాన్ని రత్న సీత ద్వారానే బయటపెట్టి మోనితకు షాకిస్తుంది.
దీంతో మోనిత .. సౌందర్య ఇంటి నుంచి బయటికి వెళ్లిపోతుంది. కట్ చేస్తే... కోటేష్ ఎత్తుకొచ్చిన మోనిత కొడుక్కి నామకరణ మహోత్సవం జరుపుతుంటారు. ఇంతకీ పేరేం పెట్టాలనుకుంటున్నారని పంతులు అడిగితే ఆనంద్ అని కోటేష్ చెబుతుండగా.. ఇంతలో రుద్రాణి కలగజేసుకుని రంగరాజు అంటుంది. అంతా ఆశ్చర్యంగా చూస్తుండగానే `ఏం శ్రీవల్లీ పేరు బావుందా?' అని ఎదురు ప్రశ్నిస్తుంది రుద్రాణి.. 'కోటేషు పేరు నచ్చిందా?.. వీడిని దత్తత తీసుకుంటున్నా'నని శ్రీవల్లి చేతుల్లో వున్న బాబుని బలవంతంగా తీసుకుంటుంది రుద్రాణి.
Also read: మళ్లీ షాకిచ్చిన మోనిత.. కీలక మలుపు
'అక్కా ఇది చాలా అన్యాయం'.. అని కోటేష్ అంటే 'అరేయ్ ప్రపంచంలో న్యాయం.. అన్యాయం అని వుండవురా.. బలవంతులు.. బలహీనులు మాత్రమే వుంటారు.' అంటుంది. ఇంతలో అక్కడే వున్న డాక్టర్ బాబు కలగజేసుకుని రుద్రాణిని ఆపే ప్రయత్నం చేస్తాడు కానీ 'ఒప్పందం ప్రకారం నీ కూతురిని తీసుకెళ్లాలి.. అలా చేయనా' అని డాక్టర్ బాబుకి మాత్రమే వినిపించేలా రుద్రాణి అంటుంది... దాంతో డాక్టర్ బాబు నిశ్చేష్టుడై వుండిపోతాడు. ఇంతలో దీప కలగజేసుకునే ప్రయత్నం చేస్తుంది. 'నేను మాట్లాడుతున్నాను కదా నువ్వు ఆగు' అంటాడు డాక్టర్ బాబు. ఆ తరువాత ఏం జరిగింది? .. రుద్రాణి బాబుని తీసుకెళ్లడంతో శ్రీవల్లి ఎలాంటి నిర్ణయం తీసుకుంది? కథ ఏ మలుపు తిరగబోతోంది?.. అన్నది తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.