English | Telugu

ఊరుకుంటున్నాను కదా అని ప్రతీసారి నా మీద డైలాగులు వేయకు చిరాగ్గా ఉంది...

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షో ఈ శనివారం ఎపిసోడ్ ఫుల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. అందులో ఫెస్టివల్ థీమ్ కావడంతో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ కలిసి మంచి మంచి కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో స్టేజి మీద మెరిశారు. అలాగే గేమ్స్ ని కూడా ఇరగదీసి ఆడారు. ఐతే ఈ షోలో రౌడీ రోహిణి ఇమ్మానుయేల్ మీద ఫుల్ ఫైర్ అయ్యింది. శ్రీముఖి రోహిణిని ఒక ప్రశ్న వేసింది "నువ్వు దీపావళి ఎలా సెలెబ్రేట్ చేసుకుంటావు" అని అడిగింది. "అందరూ చేసేవే చేస్తా. ఒక బాక్స్ లో బాంబులు తెచ్చుకుంటా..ఒక్కోటి వెలిగించి దొబ్బుతా" అంది రోహిణి.

దానికి ఇమ్మానుయేల్ కౌంటర్ ఇచ్చాడు. "ఒక బాక్స్ లో బాంబులు తెచ్చుకుంటుంది..ఇంకో బాక్స్ లో ఫుడ్ తెచ్చుకుంటుంది. అది తింటా ఇవి కాలుస్తా ఉంటది..నేను వాళ్ళ ఇంటికి ప్రతీ దీపావళికి వెళ్తాను, కానీ నాకేమీ పెట్టదు. " అంటూ రోహిణి పరువు తీసేసాడు. "కాదు కాదు రోహిణి పేల్చిన బాంబు వల్ల ఇలా అయ్యాడు" అని ఇమ్ము పరువు తీసేసాడు అమరదీప్. "ఈ ఎపిసోడ్ లో నా మీద డైలాగులు వేయడం ఇది మూడో సారో, నాలుగో సారో...అన్నీ ఓకే..కానీ ప్రతీ సారీ వేయకు నాకు చాలా చిరాగ్గా ఉంది. నేను కూడా కొన్ని కొన్ని సార్లు యాక్సెప్ట్ చేస్తా కానీ ఎక్కువగా కంటిన్యుయస్ గా అలాగే జోకులేయకు" అని ఇమ్ము మీద ఫైర్ అయ్యింది రోహిణి. వెంటనే డెబ్జానీ కూడా "నన్ను కూడా లడ్డూలా ఉన్నావు" అన్నాడు ఇమ్ము అంటూ కంప్లైంట్ చేసింది. "ఇప్పుడేదో ఫన్ చేసి తర్వాతేదో నవ్వేయడంలా కాకుండా నేను నిజంగా చెప్తున్నా అన్ని సార్లు రిపీట్ చేయకుండా ఎప్పుడో ఒకసారి అంటే ఆ జోక్ తీసుకుంటా" అంది రోహిణి. దానికి ఇమ్మానుయేల్ "ఎప్పుడూ అనడం లేదు. అరగంటకుసారే అంటున్నా" అన్నాడు. అలా ఇద్దరి మధ్యా ఒక చిన్న ఫైట్ జరిగింది.

Podharillu : మహా, చక్రిలని వెతకడానికి రంగంలోకి దిగిన రౌడీలు.. ప్రతాప్ పట్టుకుంటాడా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -23 లో...మహా ఇంట్లో నుండి వెళ్లిపోతున్నట్లు లెటర్ రాసి బయటకు వచ్చి వాళ్ళ నాన్నని గుర్తుచేసుకొని ఏడుస్తుంది. ఎలాగోలా బయటకు వచ్చేస్తుంది మహా. ఆ తర్వాత చక్రి తీసుకొని వచ్చిన కార్ ఎక్కుతుంది. ముందు అ ఫోన్ నుండి సిమ్ తియ్యండి సిగ్నల్స్ ద్వారా ట్రేస్ చేస్తే ఎక్కడున్నామో తెలుస్తుందని చక్రి అనగానే అవునని సిమ్ తియ్యబోతుంటే భూషణ్ ఫోన్ చేస్తాడు. వీడికి బాకీ ఉన్న మాటలు బాగా ఉన్నాయని ఫోన్ లిఫ్ట్ చేసి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. రేపు పెళ్లి పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నావ్ ఏంటని భూషణ్ అంటాడు.

Jayam serial : గంగని టార్గెట్ చేసిన పారు.. రుద్ర గది నుండి బయటకు రాగలడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -162 లో... రుద్ర ఇంటికి రావడంతో శకుంతల కోప్పడుతుంది. ఆ గంగ అకాడమీలో స్టే చెయ్యడంతో ఈ ఇంటి పరువుపోతుంది వెంటనే తీసుకొని రమ్మని శకుంతల చెప్తుంది. రుద్ర తన నిర్ణయాన్ని పట్టించుకోడు. అ తర్వాత రుద్ర మళ్ళీ గంగ ఉన్న అకాడమీ దగ్గరున్న టీ షాప్ కి వెళ్లి కాసేపు ఆలోచిస్తాడు. ఇక గంగకి అకాడమీ వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతున్నారేమో అని ఆలోచించిన రుద్ర అక్కడ టీ షాప్ లో ఒక బుక్ తీసుకొని అకాడమీ కాంపౌండ్ దగ్గరికి వెళ్తాడు. గంగకి ఒక పేపర్ లో మెసేజ్ రాసి లోపలికి విసురుతాడు.