English | Telugu
రొమాంటిక్ కపుల్ అవార్డు అందుకున్నాం..కానీ రొమాన్స్ చేయలేదని బాధగా ఉంది
Updated : Oct 12, 2022
స్టార్ మా పరివార్ అవార్డ్స్ ఫంక్షన్ ధూమ్ ధామ్ గా ఎంటర్టైన్ చేయబోతోందని ప్రోమో చూస్తే అర్ధమైపోతుంది. ఇక ఈ షోలో కార్తీక దీపంలో నటించిన పిల్లలు వచ్చి డాన్స్ చేశారు. అలాగే వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాధ్ కూడా వచ్చి స్టేజి మీద స్టెప్పులేసింది. "కార్తీక దీపంలో పిల్లలు పెద్దవాళ్ళవుతూ ఉన్నారు కానీ వాళ్ళ అమ్మా నాన్నే పెద్దవాళ్ళు కావట్లేదు. ఇంతకు దీప వయసెంత " అని సుమ అడిగేసరికి "నా వయసు అడిగితే మీ వయసు కూడా చెప్పాలి" అంది వంటలక్క. ఈ ప్రశ్నకు క్రిష్ జాగర్లమూడి స్టేజి మీదకు వచ్చి "సుమ గారి వయసు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంత వయసు" అని ఆన్సర్ చేశారు. దాంతో సుమకి నోటమాట రాలేదు. ఇక తర్వాత సుధీర్ ఈ స్టేజి మీద అవార్డు అందుకున్నాడు.
ఆది, సుధీర్ ఇద్దరూ వచ్చి స్టేజి మీద ఎంటర్టైన్ చేశారు. సుధీర్ "అడిగా అడిగా" అని పాట పాడేసరికి "తొమ్మిదేళ్లు అడిగి అడిగి ఇక్కడికి వచ్చేసాడు" అని కౌంటర్ వేసాడు. దానికి సుమ నవ్వేసింది. ఇక "గుప్పెడంత మనసు" సీరియల్ నుంచి రిషి అలియాస్ ముఖేష్ గౌడ అవార్డు అందుకున్నాడు. అలాగే తన తండ్రిని స్టేజి మీదకు తీసుకొచ్చాడు. "మా నాన్నను నాకు పుట్టిన కొడుకులా చూసుకుంటున్నాను" అనేసరికి "ముఖేష్ నాకు తెలిసి ఎన్ని సీరియల్స్ చేసినా, ఎన్ని అవార్డ్స్ అందుకున్నా మీ నాన్న గారిని ఇలాంటి పరిస్థితుల్లో చూసుకోవడమే గ్రేట్ ఎచీవ్మెంట్ " అని సుమ కాంప్లిమెంట్ ఇచ్చేసింది.
అలాగే "గుప్పెడంత మనసు" సీరియల్ లో నటిస్తున్న రిషి, వసుధార రొమాంటిక్ కపుల్ అవార్డు అందుకున్నారు. "రొమాంటిక్ అవార్డు అందుకున్నాము కానీ రొమాన్స్ చేయలేదని కొంచెం బాధగా ఉంది" అని ముఖేష్ ఫన్నీ గా చెప్పేసరికి సుమ "రొమాన్స్ అంటే ఏంటి అసలు" అని అడిగింది. ఇంతకు రొమాన్స్ గురించి రిషి ఏం చెప్పాడో తెలియాలంటే ఆదివారం వరకు వెయిట్ చేయాలి.