English | Telugu
రోహిత్-మెరీనా జంటకి రెమ్యూనరేషన్ మరీ ఇంతనా!
Updated : Oct 22, 2022
బిగ్ బాస్ హౌస్ లో రియల్ లైఫ్ జంట ని తీసుకోవడం వింతేమి కాదు, కాగా ఈ సీజన్లో రోహిత్-మెరీనా జంటని తీసుకోవడం జరిగింది. ఇతని పూర్తి పేరు రోహిత్ సాహ్ని. ఇతను హైదరాబాద్ లో జన్మించాడు. ఇతను M.B.A పూర్తి చేసాడు. తన చిన్నప్పటి నుండి నటన అంటే ఇష్టం తో, మొదట మోడల్ గా తన కెరీర్ ని స్టార్ట్ చేసాడంట. ఆ తర్వాత షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ మరియు సీరియల్స్ లో నటించాడు. కాగా 'భార్యామని', 'అభిషేకం', 'అభిలాష', 'అమృత వర్షిణి' లాంటి పలు సీరియల్స్ లో నటించి, బుల్లి తెరపై అలరించాడు. తర్వాత 'చిరు గొడవలు' అనే సినిమాలో మొదటిసారి కథనాయకుడిగా వెండి తెరపై నటించాడు. కాగా తన తోటి నటి అయిన మెరీనా అబ్రహంని లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మెరీనా అబ్రహం 1995 జూన్ 12 న గోవాలో జన్మించింది. కాగా మెరీనా ఫ్యామిలీ హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డారు. తనకు తెలిసినవాళ్ళు మోడలింగ్ లో ఉండడంతో, తాను మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత పలు సీరియల్స్ లో నటించింది. 'అమెరికా అమ్మాయి', 'ప్రేమ', 'సిరిసిరి మువ్వలు', 'ఉయ్యాల జంపాల' లాంటి పలు సీరియల్స్ లో నటించింది. ఆ తరువాత 'రొమాన్స్ విత్ ఫైనాన్స్' అనే మూవీ లో చేసింది. 2017 నవంబర్ లో తన తోటి నటుడు అయిన రోహిత్ ని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి బుల్లితెరపై నటిస్తూ, రాణిస్తోన్నారు.
బిగ్ బాస్ లోకి పదవ కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఈ జంట. అంచనాలకు తగ్గట్టుగా ఎంటర్టైన్మెంట్స్ అందించలేకపోతున్నారు. అయితే వీళ్ళిద్దరి పర్ఫామెన్స్ చూసి గత మూడు వారాల నుండి నాగార్జున హెచ్చరించడంతో, ఇప్పుడు పర్వాలేదు అనిపించినా ఎక్కువగా మాత్రం టాస్క్ లో పర్ఫామెన్స్ లేదనే చెప్పాలి. కాగా మూడు వారాల తర్వాత వీళ్ళిద్దరిని బిగ్ బాస్ సపరేట్ చేసి, ఇండివిడ్యువల్ గా ఆడమని చెప్పాడు. రోహిత్ తన వంతుగా పర్ఫార్మెన్స్ ఇస్తూ తన తోటి హౌస్ మేట్స్ కి గట్టి పోటీ ఇస్తూ వస్తోన్నాడు. కాగా రోహిత్, మేరీనా ఇద్దరు కూడా నామినేషన్ లో ఉన్నారు.
రోహిత్ కి రోజుకి నలభై అయిదు వేలు, మెరీనా కి ముప్పై అయిదు వేల వరకు రెమ్యూనరేషన్ ఉండొచ్చని బయట ప్రచారం జరుగుతోంది. కాగా ఈ వారం నామినేషన్లో నుండి సేవ్ అవుతారో? లేదో చూడాలి. మరి వీళ్ళిద్దరు సేవ్ అయ్యి బిగ్ బాస్ చివరి ఎపిసోడ్ వరకు ఉండి విజేతగా నిలుస్తారో? లేదో చూడాల్సి ఉంది.