Read more!

English | Telugu

అమెరికా వీధుల్లో కాజల్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్ !

సెలెబ్రిటీలు ఏం చేసిన వైరల్ అవుతుంటాయి. కొన్నిరోజుల క్రితం అమెరికాకి వెళ్ళిన ఆర్జే కాజల్ అక్కడ అంతా తిరుగుతూ వ్లాగ్స్ చేస్తోంది.  అమెరికా డైరీస్ అనే పేరుతో రోజుకో వీడియో రీలీజ్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది.  ఇన్ స్టాగ్రామ్ లో ఆర్జే కాజల్ చేసిన ఓ డ్యాన్స్ నెట్టింట వైరల్ గా మారుతోంది.

అమెరికాలో పాపులర్ అయిన NYC వీధుల్లోని టైమ్స్ స్క్వేర్ లో ఆర్జే కాజల్ అదిరిపోయే డ్యాన్స్ చేసింది. అది కూడా తెలుగు పాటకి డ్యాన్స్ చేసింది. మహేష్ బాబు, శ్రీలీల నటించిన గుంటూరు కారం సినిమాలోని " ఆ కుర్చీని మడతబెట్టి " అనే పాట ఎంత పాపులర్ అయిందో అందరికి తెలిసిందే. ఈ పాటకి ఆర్జే కాజల్ చేసిన డ్యాన్స్ ప్రస్తుతం వైరల్ గా మారింది. టైన్ స్క్వేర్ అదిరిపోయింది అంటు ఒకరు కామెంట్ చేయగా... బంగారం నాకోసమే ఈ పోస్ట్ చేసావ్ కదా అని మరొకరు కామెంట్ చేశారు. ఆర్జే కాజల్  419K ఫాలోవర్స్ కలిగి ఉంది.  అటు యూట్యూబ్ లో, ఇటు ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా పోస్ట్ లు, వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటుంది‌.

ఆర్జే కాజల్ .. తన వాయిస్ తో కోట్లాది మందికి పరిచయమైంది. సోషల్ మీడియాలో తనకు క్రేజ్ మాములుగా లేదనే చెప్పాలి. బిగ్ బాస్ సీజన్-5  ముందువరకు తన వాయిస్ తో బిగ్ బాస్ రివ్యూలు చెప్పిన కాజల్.. బిగ్ బాస్ సీజన్-5 లో ఎంట్రీతో లైవ్ లో తన నడవడితో తనకున్న ఫ్యాన్ బేస్ ని పెంచుకుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నప్పుడు షణ్ముఖ్, సిరిలతో మొదటి నాలుగువారాలు కలిసి ఉన్న కాజల్ ఆ తర్వాత వారికి దూరమైంది. ఆ తర్వాత హౌస్ లో టాప్-6 లో ఉన్న కాజల్.. ఎలిమినేట్ అయి టాప్-5 కి దూరమైంది. బయటకొచ్చాక తనకి సినిమా అవకాశాలు పెరిగాయి. ఆర్జే కాజల్ తన సంబంధించిన విషయాలని ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా షేర్ చేస్తుంటుంది. అదే కాకుండా తన యూట్యూబ్ ఛానెల్ లో కూడా వ్లాగ్ లుగా అప్లోడ్ చేస్తుంటుంది. మరి మీలో ఎంతమంది తనని ఫాలో అవుతున్నారు. మీరు తన యూట్యూబ్ ఛానెల్ లో చూసిన వ్లాగ్ ఏంటి కామెంట్ చేయండి.