English | Telugu

హీరామండి వెబ్ సిరీస్ రివ్యూ


వెబ్ సిరీస్: హీరామండి
నటీనటులు: మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు, హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్, షర్మిన్ సెగల్ తదితరులు
కథ: మెయిన్ బేగ్
సినిమాటోగ్రఫీ: సుదీప్ ఛటర్జీ, మహేష్ లిమాయే
సంగీతం, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం: సంజయ్ లీలా భన్సాలీ
ఓటీటీ : నెట్ ఫ్లిక్స్

కథ:

స్వాతంత్ర్యానికి ముందు హీరామండి అనే ప్రాంతంలో జరిగిన కథే ఇది. షాహి మహల్ కి హెడ్ గా మల్లికా జాన్(మనీషా కొయిరాల) ఉంటుంది. వహీదా (సంజీదా షేక్) ఆమె సోదరి. బిబోజాన్(అదితిరావు హైదరి), ఆలంజేబు(షర్మిన్ సెగల్) ఆమె కుమార్తెలు. ఫరీదాన్(సోనాక్షి సిన్హా) మరో మహల్ కి హెడ్ గా ఉంటుంది. మల్లికా జాన్ తన కూతురు ఆలంజేబుని వేశ్యగా మార్చాలని చూస్తుంటుంది. అయితే ఆమె బాలోచీ నవాబు అయినటువంటి తాజ్ దార్ (తాహా షా బహదూర్ షా) తో ప్రేమలో పడుతుంది. వీరిద్దరి ప్రేమ విషయం వాళ్ళ అమ్మానాన్నలకి తెలుస్తుంది. మల్లికా, వహీదాలకి మధ్య గొడవ జరుగుతుంటుంది. హీరామండి లో లోలోపల కుళ్ళు, కుతంత్రాలు నడుస్తుండగా.. మరోవైపు బ్రిటీష్‌వారు హీరామండిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అయితే బ్రిటిష్ వారితో బిబోజాన్ చేతులు కలుపుతుంది. షాహిమహల్ కోసం ఫరీదాన్ చేసిన కుట్రలేంటి? మల్లికా జాన్ ఏం చేసింది? బిబోజాన్ రహస్యంగా చేసిన పనేంటి? హీరామండిని బ్రిటీష్‌వారు సొంతం చేసుకున్నారా లేదా తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.

విశ్లేషణ:

సంజయ్ లీలా భన్సాలీ చేసిన మొదటి వెబ్ సిరీస్ ' హీరామండి'. దాంతో ఈ సిరీస్ కి క్రేజ్ ఏర్పడింది. దానికి తగ్గట్టుగానే సంజయ్ లీలా భన్సాలీ భారీ తారాగణంతో ,భారీ సెట్ లతో ముందుకొచ్చాడు. అయితే ఈ సిరీస్ మొత్తంగా ఎనిమిది ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ నిడివి గంట పైనే ఉంటుంది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో మన దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా ఎదుర్కొన్నారు. హీరామండిలోని కొందరు వేశ్యలు తమ లైఫ్ ని ఎలా సాక్రిఫైజ్ చేశారు. అప్పుడున్న పరిస్తితులని కళ్ళకి కట్టినట్టు చూపించాడు దర్శకుడు.

షాహిమహల్ దక్కించుకోవడానికి మల్లికా జాన్ చేసిన కుట్రలు, కఠినమైన నిర్ణాయాలు.. ఆమె పాత్రని మరింత బలంగా చూపించడం కోసం దర్శకుడు మొదటి రెండు ఎపిసోడ్ లు తీసుకోవడంతో అది చాలా స్లోగా సాగుతుంది. కథలోకి ఇంకా ఎప్పుడు వెళ్తామనే ఫీలింగ్ ప్రేక్షకుడికి వచ్చేస్తుంది. మొదటి రెండు ఎపిసోడ్ లు పాత్రల పరిచయానికి తీసుకున్న దర్శకుడు మూడవ ఎపిసోడ్ లో అక్కడ వేశ్యల మధ్య ఆదిపత్య పోరు, ప్రేమ , రహస్యంగా బ్రిటీషర్లతో చేతులు కలపడం ఇలా అన్నింటికి ఒకదానితో ఒకటి పోల్చుతూ సాగే కథనం బాగుంది. అయిదు, ఆరు, ఏడు ఎపిసోడ్ లలో కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది.

ఎంత బారీ తారాగణం ఉన్నా, విజువల్ గా సిరీస్ ని ఎంత రిచ్ గా చూపించినా.. కథ బలంగా లేకపోతే ప్రేక్షకుడికి నచ్చదు. అదే జరిగింది. సంజయ్ లీలా భన్సాలీ అనగానే భారీ బడ్జెట్ సినిమాలే గుర్తుకొస్తాయి. వాటికి తగ్గట్టుగానే కాస్ట్ అండ్ క్రూ కూడా ఉంటారు. అయితే ఓటీటీ కంటెంట్ లో పాటలు అంతగా సెట్ కావనే విషయం మరిచినట్టున్నారు. ఇక ఏడు, ఎనిమిది ఎపిసోడ్ లలో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో భన్సాలీ మార్కులు కొట్టేశాడు. కానీ స్లో స్క్రీన్ ప్లే పెద్ద మైనస్ గా మారింది. ఫ్యామిలీతో కలిసి చూసేలా తీసాడు. కానీ హీరామండిలో జరిగిన వాస్తవ సంఘటనలు స్పష్టంగా చూపించడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ లో చాలా వరకు కంటెంట్ తీసేయొచ్చు. కానీ భన్సాలీనే ఎడిటింగ్ చేసుకోవడంతో అన్ని అలానే ఉంచినట్టున్నాడు. కానీ ఓటీటీ ప్రేక్షకులకి అది అంతగా నచ్చకపోవచ్చు. కానీ ఈ సిరీస్‌ పూర్తి చేయాలంటే మినిమమ్ ఆరు గంటల సమయం ఓపికతో చూడాలి. అసభ్య పదజాలం వాడలేదు, అశ్లీల దృశ్యాలు లేవు. ఫ్యామిలీతో కలిసి చూసేలా భన్సాలీ తీసారు.


నటీనటుల పనితీరు:

మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితి రావు, హైదరి, రిచా చద్దా, సంజీదా షేక్ ప్రతీ ఒక్కరు తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.


ఫైనల్ గా :

ఫ్యామిలీతో కలిసి చూసేలా తీసిన ఈ సిరీస్ చూడాలంటే కాస్త ఓపిక ఉండాలి. కానీ ఇది ఓ విజువల్ ఫీస్ట్.


రేటింగ్ : 2.5 / 5

✍️. దాసరి మల్లేశ్

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.