English | Telugu
ఆర్జే చైతు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న కాజల్.. ఫ్రెండ్షిప్ కి వేల్యూ లేదన్న శ్రీముఖి
Updated : May 1, 2023
"ఆదివారం విత్ స్టార్ మా పరివారం" ఈ వారం బీబీ జోడి కంటెస్టెంట్స్ మస్త్ ఎంటర్టైన్ చేసింది. వాళ్ళ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో పాటు అవినాష్, హరి, ఫైమా కామెడీ బాగా నవ్వించింది. ఐతే ఇందులో ఆర్జే కాజల్ కన్నీళ్లు పెట్టుకుంది. బీబీ జోడి టాప్ 5 కంటెస్టెంట్ జోడీస్ ఐన ఆర్జే సూర్య-ఫైమా, అవినాష్-అరియనా, మెహబూబ్-శ్రీసత్య, అర్జున్ కళ్యాణ్-వాసంతి, ఆర్జే చైతు-ఆర్జే కాజల్ వచ్చారు. లేడీస్ ని, జెంట్స్ ని వేరువేరుగా డివైడ్ చేసి గేమ్స్ ఆడించింది. అందులో రౌండ్ 3 లో "లోపల చాలా ఉన్నాయి దాచాం.." సెగ్మెంట్ లో లేడీస్ గెలిచేసరికి పరివారం బ్యాంకుకి కాజల్ ని పంపించింది హోస్ట్ శ్రీముఖి. ఆమెతో పాటు ఆర్జే చైతు కూడా వెళ్ళాడు. లోపలి వెళ్ళాక కాజల్ బి నంబర్ బాక్స్ తీద్దామనుకుంటే చైతు మాత్రం డి నంబర్ బాక్స్ తీయించాడు. బి నంబర్ బాక్స్ లో 50 వేలు, డి నంబర్ బాక్స్ లో 500 లు ఉన్నాయి. ఇక చైతు మాట విని డి నంబర్ బాక్స్ ని బయటికి తీసుకొచ్చింది కాజల్. చైతు ఇక్కడ చాల స్ట్రాటజీ ప్లే చేసి నీతో డి బాక్స్ తీసుకొచ్చేలా చేసాడు అని శ్రీముఖి చెప్పేసరికి కాజల్ స్టన్ ఐపోయింది.
"చైతు నిన్ను గెలిపించడానికి వచ్చాడనుకుంటున్నావా" కాజల్ అని సూర్య అనేసరికి "నేనేమి నిన్ను గెలిపించడానికి రాలేదు" అన్నాడు చైతు. "చైతు ఇంటెన్షన్ చాలా ప్యూర్ గా ఉంటుంది అని నేను అనుకుంటున్నా..తాను నన్ను గెలిపించడానికే వచ్చాడు" అని చెప్పింది కాజల్. "నువ్వెన్ని మోసాలు చేసినా నేను నిన్నేమీ అనలేదు" అంటూనే స్టేజి మీద ఏడ్చేసింది కాజల్. "నేను ఎన్ని మోసాలు చేసాను..జీరో రాలేదు కదా, 500 అన్నా వచ్చింది కదా. నేను అనుకున్నది ఏమిటి అంటే తనకు జీరో రాకూడదు. అట్లీస్ట్ ఎంతో కొంత అన్నా రావాలి అనే ఉద్దేశంతో ఇలా చేసాను" అన్నాడు చైతు కాజల్ కన్నీళ్లు తుడిచి ఓదార్చాడు. కానీ "నువ్వు నీకు నచ్చిన లెటర్ డి ని తియ్యమని కాజల్ కి ఎలా చెప్తావ్. నీవల్ల ఫ్రెండ్షిప్ అనే పదానికే వేల్యూ లేకుండా పోతోంది" అని శ్రీముఖి సెటైర్ వేసింది. ఇలా ఈ వారం ఈ స్టేజి మీద కాజల్ ఎమోషనల్ అయ్యింది.