English | Telugu

నాగిన్ డ్యాన్స్‌..కాజ‌ల్‌, యానీ ఇంత షాకిచ్చారేంటీ?

బిగ్ బాస్ సీజ‌న్ 5 లో ఆర్జే కాజ‌ల్‌, యానీ మాస్ట‌ర్ ల మ‌ధ్య ఏ రేంజ్ లో గొడ‌వ‌లు జ‌రిగాయో తెలిసిందే. క్ష‌ణం ప‌డేది కాదు. సంద‌ర్భం వ‌స్తే చాలు కాజ‌ల్ ని యానీ మాస్ట‌ర్ గేలి చేయ‌డం.. రెచ్చ‌గొట్టే విధంగా ఆమె ముందే డ్యాన్స్ చేయ‌డం.. నాగిన్ నాగిన్ అంటూ నాగిన్ డ్యాన్స్ చేయ‌డం తెలిసిందే. ఒక విధంగా హౌస్ లో వున్నన్ని నాళ్లు ఇద్ద‌రు బ‌ద్ధ‌ శ‌త్రువుల్లా వున్నారు. ఒక‌రిని ఒక‌రు ఈటెల్లాంటి మాట‌ల‌తో దూషించుకున్నారు... ఒక ద‌శ‌లో కొట్టుకున్నంత ప‌ని చేశారు.

కానీ క‌ట్ చేస్తే.. సీన్ మారింది. హౌస్ వ‌ర‌కే అవ‌న్నీ అని బ‌య‌ట వాటికి చోటు లేద‌ని నిరూపించి షాకిచ్చారు. కాజల్ ని యానీ మాస్ట‌ర్ టార్గెట్ చేయడం నెటిజ‌న్ ల‌కి న‌చ్చ‌లేదు. దీంతో ఆమెపై నెగిటివిటీ పెరిగిపోయింది ఫ‌లితం ఓటింగ్ దారుణంగా ప‌డిపోయి యానీ మాస్ట‌ర్ ఎలిమినేట్ కావాల్సి వ‌చ్చింది. ఇక బ‌య‌టికి వ‌చ్చాక కూడా యానీ మాస్ట‌ర్ తీరు సీజ‌న్ ముగిసే వ‌ర‌కు మార‌లేదు. కాజ‌ల్, స‌న్నీ, మాన‌స్ గ్రూప్ కు స‌పోర్ట్ చేయ‌కుండా శ్రీ‌రామ‌చంద్ర‌ని, యాంక‌ర్ ర‌విని స‌పోర్ట్ చేసింది.

ఇంత చేసిన యానీ మాస్ట‌ర్ ని కాజ‌ల్ ఫ్రెండ్ గానే భావించింది. తాజాగా కాజ‌ల్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్ కోసం యానీ మాస్ట‌ర్ ని క‌లిసిన‌ట్టుగా తెలుస్తోంది. ఆ క్ర‌మంలోనే ఛాన‌ల్ కోసం ఇద్ద‌రూ క‌లిసి నాగిన్ డ్యాన్స్ వేసిన‌ట్టుగా తెలుస్తోంది. త‌న‌ని హౌస్ లో ఇబ్బంది పెట్టినా కాజ‌ల్ మాత్రం యానీ మాస్ట‌ర్ పై పాజిటివ్ గానే స్పందించ‌డం నెటిజ‌న్ ల‌ని ఆక‌ట్టుకుంటోంది. వీరిద్ద‌రూ క‌లిసి చేసిన నాగిన్ డ్యాన్స్‌ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా కాజ‌ల్‌, యానీ ఇంత షాకిచ్చారేంటీ? అని అవాక్క‌వుతున్నారు.

" width="400" height="700" layout="responsive">

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.