English | Telugu
బోనాల సెలెబ్రేషన్స్ లో భార్యతో సందడి చేసిన రియాజ్
Updated : Jul 30, 2022
జబర్దస్త్ కామెడీ షో ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి కమెడియన్ గా మంచి గుర్తింపుని తెచ్చుకున్నాడు రియాజ్. ఆ తరువాత బొమ్మ అదిరింది, అదిరింది షోలతో బాగా పాపులర్ అయ్యాడు. జనసేన తరుపున నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇటీవలే రియాజ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి సారి భార్యతో కలిసి జీ తెలుగులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జాతర షోలో పాల్గొన్నాడు. ఇదే వేదిక సాక్షిగా తన భార్యని అందరికి పరిచయం చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.
బోనాల సెలబ్రేషన్స్ లో భాగంగా జీ తెలుగు వారు ప్రత్యేకంగా జాతర ఈవెంట్ ని నిర్వహించారు. శ్రీముఖి యాంకర్ గా వ్యవహరించిన ఈ షోలో రియాజ్ తన భార్య యాస్మిన్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇదే క్రమంలో తన భార్య పేరు యాస్మిన్ అని చెప్పడం.. సద్దాం మాత్రం యాస్మిన్ రియాజ్ అని అనడంతో రియాజ్ మురిసిపోవడం ప్రోమోలో నవ్వులు పూయిస్తోంది. ఇక స్టేజ్ పై రియాజ్, యాస్మిన్, సద్దాంలని కూర్చోబెట్టి ఈ ఇద్దరిలో కామెడీ ఎవరు బాగా చేస్తారని యాస్మిన్ ని అడిగింది శ్రీముఖి. వెంటనే రియాజ్ అని సమాధానం చెప్పింది యాస్మిన్.
దీంతో షోలో పాల్గొన్న వాళ్లంతా నవ్వుల్లో మునిగితేలారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమో నెట్టింట ప్రస్తుతం సందడి చేస్తోంది. గతంలో వైఎస్ జగన్ ని ఇమిటేట్ చేసిన రియాజ్ ఆ తరువాతజగన్ ఫ్యాన్స్ ఫైర్ అవ్వడంతో క్షమాపణలు చెప్పి వివాదానికి ముగింపు పలికాడు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా వున్నాడు రియాజ్.