Read more!

English | Telugu

కేడీ బ్యాచ్ కి రిషి మాస్ వార్నింగ్..  వసుధార ఆ కొత్త సర్ ని తెలుసుకోగలదా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -785 లో.. కేడి బ్యాచ్ రిషిని ఎంత ఎగతాళి చేసినా ఏం పట్టనట్లు నవ్వుతుంటే కేడి బ్యాచ్ కి కోపం వస్తుంది. వీడేంట్రా మనం ఎంత ఇరిటేట్ చేసినా చిరునవ్వు నవ్వుతూ వెళ్తున్నాడు. సర్ సాఫ్ట్ గా ఉన్నాడు. ఎలాగైనా సర్ కి కోపం వచ్చేంత వరకు చిరాకు తెప్పిస్తూనే ఉండాలని కేడి బ్యాచ్ అనుకుంటారు. మనం ఇలాగే చేసుకుంటూ పోతే చరిత్రలో మిగిలిపోతామని అంటూ తాము చేసే పనులను గొప్పగా చెప్పుకుంటారు కేడి బ్యాచ్.

మరొకవైపు మురుగన్ దగ్గరికి రిషి వెళ్తాడు. ఎవరు నువ్వు ఎందుకు వచ్చావని రిషిని మురుగన్ అడుగుతాడు. విశ్వనాథ్ మనిషిని అని రిషి అంటాడు. ఓ సర్ .. పాఠాలు చెప్పుకోకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావని మురుగన్ అడుగుతాడు. కొందరికి గుణపాఠాలు చెప్పాలని వచ్చాను. కాలేజీలో కేడి బ్యాచ్ పద్ధతేం బాగోలేదు. మీరైనా మీ పిల్లలకు బుద్ధి చెప్పండి. బుద్దిగా ఉండమని చెప్పండని రిషి అంటాడు.బుద్దిగా  లేకపోతే ఏం చేస్తావని మురుగన్ అంటాడు.

బెండు తీస్తా అని రిషి అనగానే.. మురుగన్ షాక్ అవుతాడు. నా గురించి నీకు తెలిస్తే ఇలా మాట్లాడవని మురుగన్ అంటాడు. నా గురించే మీకు తెలియదని రిషి వార్నింగ్ ఇస్తాడు. రిషి వార్నింగ్ ఇవ్వగానే పక్కనే ఉన్న రౌడీలు రిషిని కొట్టాడానికి ట్రై చేస్తే.. రిషి తిరిగి ఆ రౌడీలనే కొడతాడు. రౌడీలు రిషిని చూసి భయపడతారు. మురుగన్ కూడా రిషికి భయపడుతాడు. మురుగన్ కి రిషి గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు.

ఆ తర్వాత రిషి కాలేజీకి వెళ్తాడు. అక్కడ ప్రిన్సిపల్ కి మురుగన్ కి వార్నింగ్ ఇచ్చిన విషయం చెప్పి మీరేం టెన్షన్ పడకండి.. నేను చూసుకుంటానని రిషి అంటాడు. థాంక్యూ సర్ మిమ్మల్ని మా స్టాఫ్ కి పరిచయం చేస్తా అని ప్రిన్సిపల్ రిషిని తీసుకెళ్తాడు. రిషి స్టాఫ్ రూమ్ కి వెళ్తుండగా.. అప్పుడే వసుధారకి ఫోన్ వస్తే బయటకు వెళ్తుంది. రిషి వచ్చి స్టాఫ్ తో మాట్లాడి వెళ్ళిపోతాడు.

రిషి వెళ్ళిన తర్వాత వసుధార వస్తుంది. అక్కడున్న స్టాఫ్, ఒక కొత్త సర్ వచ్చి కేడి బ్యాచ్ కి బుద్ధి చెప్పాడంటూ వసుధారకి చెప్తారు. అప్పుడు వసుధార ఆ సర్ ఎవరని బయటకు వెళ్ళి చూసేలోపు రిషి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత విశ్వనాథ్ దగ్గరికి రిషి వెళ్లి జరిగిందంతా చెప్తాడు. నువ్వు కేడి బ్యాచ్ కి బుద్ధి చెప్పాలంటే కాలేజీకి వెళ్ళాలని విశ్వనాథ్ అంటాడు. నేను వెళ్ళనని రిషి అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.