Read more!

English | Telugu

రిషి జైలులో ఉండటానికి కారణం అదేనా?!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -781 లో.. రిషి జైలు లో ఖైదీలకు మోటివేషన్ క్లాస్ లు ఇస్తుంటాడు. వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకునేలా రిషి మాట్లాడతాడు. దాంతో ఖైదీలు వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకొని.. మేము ఒక్క క్షణం ఆలోచించి ఉంటే తప్పు చేసి ఉండేవాళ్ళం కాదంటూ రిషికి థాంక్స్ చెప్తారు.

ఆ తర్వాత రిషి మోటివేషన్ క్లాస్ అయిపోయి బయటకు రాగానే.. తన ఫ్రెండ్ ఏంజెల్ ఎదురు వస్తుంది. పద రిషి బయటకు వెళదామని ఏంజెల్ అంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళదాం.. వద్దని రిషి అంటాడు. అయినా ఏంజెల్ పట్టించుకోకుండా సినిమాకి వెళదామంటూ రిషిని ఒప్పించి తీసుకొని వెళ్తుంది. మరొకవైపు వసుధార కాలేజీ నుండి ఇంటికి డల్ గా వస్తుంది. ఏంటి అక్క కాలేజీ ఎలా ఉందని ఒక అమ్మాయి అడుగుతుంది. నాకు నచ్చలేదని వసుధార అంటుంది. నేను చెప్పాను కదా అక్క.. అక్కడ రౌడీ బ్యాచ్ ఉంటుంది.. అట పట్టిస్తారని ఆ అమ్మాయి అంటుంది.

అప్పుడే చక్రపాణి వచ్చి.. ఏమైంది అమ్మా అనవసరంగా వెళ్ళావ్.. ఆ కాలేజీ కి వెళ్ళకని చెప్పానా అని వసుధారతో అంటాడు.‌ ఏ కాలేజీ లో అయినా సీనియర్ జూనియర్ ని ర్యాగింగ్ చేస్తారు. కానీ ఈ కాలేజీ లో స్టూడెంట్స్ ఫాకల్టీని ఆటపట్టిస్తున్నారు. అదే విషయం ప్రిన్సిపాల్ కి చెప్తే వాళ్ళని పట్టించుకోకు.. నీ పని నువ్వు చూసుకో అని అన్నాడు. వాళ్ళకి తప్పు రైట్ అని ఫాకల్టీగా చెప్పడం నా బాధ్యత అని వసుధార అంటుంది.

మరొకవైపు ఏంజెల్, రిషి ఇద్దరు కలిసి మూవీకి వెళ్లి ఇంటికి తిరిగి వస్తారు. ఏంజెల్ తాతయ్య తనని‌ చూసి ఎక్కడికి వెళ్ళారని అడుగుతారు. సినిమాకి వెళ్ళామని ఏంజెల్ చెప్తుంది. రిషి నువ్వు జైల్లో మోటివేషన్ క్లాస్ లు బాగా చెప్తున్నావని జైలర్ గారు ఫోన్ చేసి చెప్పారు. మీ వల్లే నేను బతికి ఉన్నాను.. ఆ రోజు నాకు బ్లడ్ ఇచ్చి నా ప్రాణం కాపాడావు ఏంజెల్ అని రిషి అంటాడు.

నువ్వు నా ఫ్రెండ్ వి అందుకే అలా చేశానని ఏంజెల్ అంటుంది. మరొకవైపు మహేంద్ర దగ్గరికి ధరణి కాఫీ తీసుకొని వెళ్ళి.. చిన్న అత్తయ్య మీరు ఇలా ఉండడం నాకు నచ్చలేదు మామయ్య.. రిషి వెళ్లిపోయాడని మీరు ఎంత బాధపడుతున్నారో చిన్న అత్తయ్య కూడా అంతే బాధపడుతున్నారని ధరణి అంటుంది. మా ఇద్దరి బాధ సమానం కాదు ధరణి. అసలు రిషి వెళ్లిపోయేలా చేసిందే తను అని మహేంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.