English | Telugu

వాళ్ళిద్దరిది అగ్రిమెంట్ మ్యారేజ్ అనే నిజాన్ని రేవతితో  చెప్పేసిన ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్‌-175లో.. రేవతి కూరగాయలు కట్ చేసుకుంటూ ముకుంద గురించి ఆలోచిస్తుంటుంది. మురారి దక్కలేదనే ఆలోచనలో రోజురోజుకి ముకుంద ఉన్మాదిగా మారిపోతుందని రేవతి భావిస్తుంది. కాసేపటికి ముకుంద కోసం కాఫీ తీసుకుని తన గదిలోకి వెళ్తుంది రేవతి. అక్కడ ముకుంద ఒక నోట్స్ లో 'ఐ లవ్ యూ మురారి' అని రామకోటిలాగా రాస్తుంటుంది. రేవతి వెళ్ళి ముకుంద అనేసరికి.. ముకుంద ఒక్కసారిగా ఉలిక్కిపడి వెంటనే ఆ నోట్స్ క్లోజ్ చేసి వస్తుంది.

నువ్వు దాస్తుందేంటి అని రేవతి అడుగగా.‌. నా జ్ఞాపకమని ముకుంద చెప్తుంది. నీ జ్ఞాపకాలైతే ఒకే కానీ ఈ ఇంటి పరువు పోయేలా ఉండకూడదని రేవతి అంటుంది. ఆ నోట్స్ తీసుకొని చూడగా అందులో ముకుంద రాసింది చూసి.. "ఎందుకిలా చేస్తున్నావ్.. నీకు పెళ్ళైంది.. మురారికి పెళ్ళైంది. ఇప్పుడు అలా ఆలోచించడం తప్పు. నా కొడుకు కోడలి కాపురాన్ని పాడుచేయకు వాళ్ళని అలా ఉండనివ్వు" అని ముకుందతో రేవతి అంటుంది. మురారి నాకు కావాలని ముకుంద అనగా.. తప్పు వాళ్ళిద్దరి పచ్చని కాపురంలో చిచ్చుపెట్టకని రేవతి అంటుంది. వాళ్ళిద్దరు నిజమైన భార్యాభర్తలు కాదు.. వాళ్ళది అగ్రిమెంట్ మ్యారేజ్ అని రేవతితో ముకుంద అంటుంది. అది విని ఒక్కసారిగా రేవతి షాక్ అవుతుంది. గుండెపగిలినంతగా బాధపడుతూ ముకుంద గదిలో నుండి రేవతి బయటకు వస్తుంది.

మరొకవైపు మురారి, కృష్ణ ఇద్దరు కలిసి అనాధాశ్రమంకి వెళ్తారు. కృష్ణ వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలతో ముచ్చటిస్తుంది. కాసేపటికి మురారి లోపలికి రాగానే పిల్లలందరూ మురారి దగ్గరికి వచ్చి ముచ్చటిస్తారు. అది చూసి ఆశ్చర్యపోయిన కృష్ణ.. ఈ అన్నయ్య మీకేలా తెలుసని పిల్లలతో అనగా.. అదేంటి ఈ అన్నయ్యనే కదా ఈ ఆశ్రమాన్ని ‌నడిపించేదని ఆ పిల్లలు చెప్తారు. అది కృష్ణ విని మీరు దేవుడు ఏసీపీ సర్ అని అంటుంది. మరి ఇది నీకెలా తెలుసని మురారి అడుగగా.. రెండు వారాలకోసారి వచ్చి సేవ చేస్తానని కృష్ణ అనగానే.. మన ఇద్దరి అభిరుచులు ఒకటే అని మురారి, కృష్ణలు వారి మనసులో అనుకుంటారు. కాసేపు అక్కడి పిల్లలతో కృష్ణ, మురారి ఇద్దరు ఆడుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.



Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.