English | Telugu

నామినేషన్లో శివాజీ మాస్  ఎలవేషన్.. హౌజ్ లో రతిక బంఢారం బయటపడిందా?

బిగ్ బాస్ సీజన్-7 గ్రాంఢ్ గా లాంఛ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇందులో హౌజ్ లోకి మొత్తంగా పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ ఉండగా, అందులో కిరణ్ రాథోడ్ గతవారం ఎలిమినేట్ అయింది‌. అయితే సోమవారం స్టార్ట్ అయిన నామినేషన్లు మంగళవారానికి చేరుకున్నాయి. సోమవారం రోజు పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేసిన అమర్ దీప్.. హీరో స్థానం నుండి జీరోకి పడిపోయాడు. బీటెక్ చదివినోడు గోప్పా? రైతు గొప్పా అంటూ రైతులని తక్కువ చేసి మాట్లాడిన అమర్ దీప్ ని ఇప్పటికే రైతులంతా వ్యతిరేకిస్తున్నారు. కాగా గౌతమ్ కృష్ణ తెలిసి తెలియకుండా నామినేషన్ చేశాడు. దాదాపు నెక్ట్ వీక్ ఎలిమినేషన్ లో గౌతమ్ కృష్ణ ఉంటాడని అందరు అనుకుంటున్నారు.

కాగా మంగళవారం జరిగిన నామినేషన్లో పల్లవి ప్రశాంత్ ని, శివాజీని శోభాశెట్టి నామినేట్ చేసింది. దాని తర్వాత శోభాశెట్టిని శివాజీ నామినేట్ చేశాడు. ఇక మరొక నామినేషన్ కోసం బిగ్ బాస్ అడిగిన శివాజీ రెండవ నామినేషన్ వేయలేదు. ఇక కాసేపు బిగ్ బాస్ తో డిస్కషన్ జరిగాక అమర్ దీప్ ను నామినేట్ చేశాడు శివాజీ.‌ శోభా శెట్టి నామినేషన్ తర్వాత శివాజీకి, శోభాశెట్టికి మధ్య వాగ్వాదం జరిగింది. నువ్వెంత ? వెళ్ళిపో అంటూ శోభాశెట్టిని అనగా.. మీరెవరు నాకు చెప్పడానికి బిగ్ బాస్ చెప్తే వెళ్తానని శోభాశెట్టి చెప్పింది.

రతికని గౌతమ్ కృష్ణ నామినేట్ చేశాడు. లవ్ ఆంగిల్ అనిపిస్తుందని నాతో చెప్పినవా లేదా అని గౌతమ్ కృష్ణ అన్నాడు. నేను నీతో అన్నానా అని రతిక అంది‌. అక్కడ ఎవరో ఉన్నారు , గుర్తులేదని గౌతమ్ కృష్ణ అనగా.. పిచ్చి పిచ్చి నామినేషన్ ప్రాసెస్ కాదిక్కడ అని రతిక వాదిస్తుంటే.. ఎందుకలా అరుస్తున్నావ్ రతిక, నాకు అరవడం వచ్చని గౌతమ్ కృష్ణ వాయిస్ రేజ్ చేశాడు. ఇక రతికని నామినేట్ చేసి వెళ్ళిపోయాడు గౌతమ్ కృష్ణ. రతికని టేస్టీ తేజ నామినేట్ చేశాడు.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.