English | Telugu

నందు పెళ్ళి దగ్గరుండి జరిపిస్తానని మాట ఇచ్చిన మురారి! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -125 లో.. నందుని పెళ్ళిచేసుకోవడానికి భవాని ఇంటికి వచ్చిన అబ్బాయితో మురారి పక్కకి తీసుకెళ్ళి మాట్లాడుతాడు. ఈ పెళ్లి అంటే మీకు ఇష్టమేనా? ఎవరైనా బలవంతం చేస్తున్నారా? అని మురారి అతడిని అడుగుతాడు. నాకు ఇష్టమే.. ఎవరు నన్ను బలవంతం చెయ్యట్లేదు.. పైగా మీ ఇంటితో సంబంధం కుదుర్చుకోవడం మా వాళ్లకి ఇష్టమని ఆ అబ్బాయి చెప్తాడు. సరే మీరు నందు గురించి తెలిసి కూడా పెళ్లి చేసుకుంటున్నారంటే దానికి మీకు థాంక్యూ అని చెప్తాడు మురారి. ఇక ఇంతలోనే ఈశ్వర్ వచ్చి మీరు మాట్లాడుకోవడం అయిపోతే కిందకి వెళ్ళండని అబ్బాయిని పంపిస్తాడు. అక్కడికి భవాని, ప్రసాద్ లు వస్తారు. మనం ఎలాగైనా అమెరికా పంపిస్తున్నాం కదా.. అదే పెళ్లి చేసి పంపిద్దామని భవాని అంటుంది. ఈ విషయం కృష్ణకి తెలియొద్దు.. తెలిస్తే నందుకి చెప్తుంది.. దాంతో నందు మారం చేస్తుంది. అందుకే కృష్ణకి తెలియనివ్వద్దు మురారి అని భవాని అంటుంది. ఇంట్లో పెళ్ళి జరిగితే తెలియకుండా ఎలా ఉంటుందని మురారి అంటాడు. ఇంతలో ముకుంద అక్కడికి వచ్చి.. ఆ విషయం నేను చూసుకుంటానని అంటుంది. నందు పెళ్లి దగ్గరుండి జరిపిస్తానని మాట ఇవ్వమని భవాని అనగానే.. భవాని చేతిలో చెయ్యి వేసి మరీ మాట ఇస్తాడు మురారి.

మరోవైపు కృష్ణ దగ్గరికి గౌతమ్ వచ్చి.. ఏం ఆలోచిస్తున్నావు కృష్ణ అని అడుగుతాడు. మీ పెళ్లి గురించే అని కృష్ణ అనగానే.. ఎందుకు ఏ గుళ్ళోనో, ఆర్య సమాజ్ లోనో చేద్దామని ప్లాన్ చేస్తున్నావా అని గౌతమ్ అడుగుతాడు. లేదు ఇంట్లో అందరిని ఒప్పించి గ్రాండ్ గా చేద్దామని అనుకుంటున్నాని కృష్ణ చెప్తుంది. నీకు ఆ భవాని, ఈశ్వర్, ప్రసాద్ ల గురించి తెలియదు. ఎంత మంచి వాళ్ళో.. అంత చెడ్డవాళ్ళు అని గౌతమ్ అంటాడు. ఒకరకంగా నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం వాళ్ళే, నన్ను చదివించారు కాని వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటా అంటే మాత్రం వాళ్ళకి స్థాయి కావాలని గౌతమ్ అనగానే.. ఇప్పుడు మీరు మంచి స్థాయిలో ఉన్నారు. ఇంట్లో వాళ్ళు నాకు తెలియకుండా ఏదో ప్లాన్ చేస్తున్నారు. చివరి వరకు ఓడిపోయినా, లాస్ట్ కి నేనే గెలుస్తాను. మీ పెళ్లి నేనే చేస్తానని కృష్ణ అంటుంది.

ఆ తర్వాత మురారి దగ్గరికి ముకుంద వచ్చి.. నీ భార్య నన్ను అవమానించింది.. నన్ను మధ్యలో వదిలేసిపోయారని ముకుంద అంటుంది. కృష్ణ నాతో మాట్లాడాలని అనుకున్నప్పుడు నువ్వు ఎందుకు అలా చేసావని ముకుందని అడుగుతాడు మురారి. ఇంతలోనే భవాని పిలుస్తుందని వెళ్ళిపోతాడు.. ఆ తర్వాత కృష్ణ ఇంకా ఇంటికి రాలేదని తనకి ఫోన్ చేస్తాడు మురారి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.