English | Telugu

కావ్యను పెళ్ళి చేసుకోనని రాజ్ చెప్పడంతో కుప్పకూలిన కనకం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -36 లో.. పెళ్ళిపీటల మీద కావ్యని చూసిన రాజ్ కోపంతో.. "ఎందుకు ఇలా మోసం చేసావ్? నా మీద పగ తీర్చుకోవడానికే ఇదంతా చేసావా? ఇప్పుడు మీడియా ముందు మా పరువు పోయేలా చేసావ్" అంటూ కావ్యని తిడతాడు. "కావ్య తప్పేం లేదు బాబు.. స్వప్నకి నువ్వంటే ఇష్టం అనుకున్నాను కానీ అది పెళ్ళి టైంకి పారిపోయింది. మీ పరువుపోతుందని కావ్యకి ఇష్టం లేకున్నా నా కోసం కూర్చుంది" అని కనకం చెప్తుంది. కనకం ఏం చెప్పినా రాజ్ ఫ్యామిలీ వినిపించుకోరు.

రాజ్ ఫ్యామిలీ అందరు కలిసి ఏదో ఒక ప్రశ్న కనకంని అడుగుతూనే ఉంటారు. మిగతా ఇద్దరు కూతుళ్ళు విదేశాల్లో ఉంటారని చెప్పావ్.. ఇంత మోసం చేస్తావా అంటూ రాజ్ ఫ్యామిలీ వాళ్ళు నిందింస్తుంటారు. మరోవైపు రాహుల్ తో స్వప్న హ్యాపీగా ఉంటుంది. దుగ్గిరాల ఫ్యామిలీ పరువు ఇప్పుడు మొత్తం పోతుందని రాహుల్ భావిస్తాడు.

ఆ తర్వాత కృష్ణమూర్తి తన భార్య కనకం ఆడిన అబద్ధాలన్నీ రాజ్ ఫ్యామిలీకి చెప్తాడు. "మాకు ముగ్గురు కూతుళ్ళు.. మేము ధనవంతులం కాదు. పెద్దకూతురు స్వప్న ఎవరితోనో వెళ్ళిపోయింది. అక్కడ ఉన్నది మా రెండో కూతురు కావ్య. తను మా మూడో కూతురు అప్పు" అని కృష్ణమూర్తి మొత్తం చెప్తాడు. అది విన్న రాజ్ ఫ్యామిలీ ఇంత మోసం చేస్తారా అని కోపంగా ఉంటారు. సగం పెళ్ళి అయింది. నా కూతురికి అన్యాయం చెయ్యకండి.. కావ్యని పెళ్లి చేసుకోండని రాజ్ ని, వాళ్ళ ఫ్యామిలీని బ్రతిమిలాడుకుంటుంది కనకం. ఈ మోసగత్తెని నేను పెళ్లి చేసుకోనని రాజ్ వెళ్లిపోతుంటాడు. కనకం రాజ్ ఫ్యామిలీలోని అందరిని బ్రతిమాలినా కూడా ఎవరు వినకుండా వెళ్ళిపోతారు. దాంతో కనకం ఒక్కసారిగా కింద పడిపోతుంది.‌ ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.