English | Telugu

ముకుంద, మురారిల ప్రేమాయణం తెలుసుకున్న రేవతి!

'కృష్ణ ముకుంద మురారి' సీరియల్ 63వ ఎపిసోడ్ లోకి అడుగుపెట్టింది. బుధవారం నాటి ఎపిసోడ్ లో ముకుంద గురించి ఆలోచిస్తూ మురారి తనకి వీడియో కాల్ చేస్తాడు. "ఎందుకు ఇలా చేస్తున్నావ్ ముకుంద.. నీకు పెళ్లి అయింది.. నాకు పెళ్లి అయింది. ఇలా నువ్వు సంతోషంగా ఉండవు. నన్ను ఉండనివ్వట్లేదు. నువ్వు ఇంటికి వచ్చి.. మన ప్రేమ విషయం ఇంట్లో వాళ్ళందరికి తెలిసేలా చేస్తున్నావ్" అని మురారి మాట్లాడుతాడు. "ఈ సమాజం గురించి నేనేం అలోచించను. ఎవరు ఏం అనుకున్నా నాకు అవసరం లేదు నా ప్రేమని బ్రతికించుకుంటాను.. నీకు దూరంగా ఉండడం నాకు నరకంగా ఉంది. అందుకే నీ ఫోటోని నా పక్కనే పెట్టుకొని పడుకున్నాను" అని ఫొటో చూపిస్తుంది ముకుంద.

మరోవైపు మురారికి కాఫీ తీసుకొని వస్తుంది రేవతి. అయితే అప్పటికే మురారి ఎవరితో మాట్లాడుతుండటం గమనించి ఫోన్ చూస్తుంది రేవతి. రూమ్ కి వెళ్లి చూసేసరికి వీడియో కాల్ లో ముకుందతో మాట్లాడుతుంటాడు. ముకుంద, మురారిల ప్రేమ విషయం తెలుసుకొని షాక్ లో ఉంటుంది. అటుగా వస్తున్న కృష్ణని మురారి దగ్గరికి వెళ్లకుండా ఆపుతుంది. ఎక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నది కృష్ణ చూస్తుందోనని టెన్షన్ పడుతుంటుంది రేవతి. అప్పటికే కృష్ణకి డౌట్ వచ్చి ఏంటి అత్తయ్య నా దగ్గర ఏమైనా విషయం దాస్తున్నారా? ఎందుకు కంగారు పడుతున్నారు అని కృష్ణ అడుగుతుంది. మాట దాట వేసే ప్రయత్నం చేస్తుంది రేవతి‌.

ఆ తర్వాత కాసేపటికి నందినికి అన్నం తినిపిస్తుంటుంది కృష్ణ‌. అక్కడకు వచ్చిన మురారిని చూసి నందిని తనకి కూడా తినిపించు కృష్ణ అని అంటుంది. దాంతో అక్కడే ఉన్న భవానీ "సరే వెళ్ళు" అన్నట్టుగా సైగ చేస్తుంది. అలా తన పక్కన కూర్చొన్న మురారికి కృష్ణ అన్నం తినిపిస్తుంది. అది చూసి రేవతి మనసులో "కృష్ణతో బాగానే ఉంటున్నాడు కదా.. మరి ముకుందని ఎలా ప్రేమించాడు" అని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.