English | Telugu

రిషి తనని పట్టించుకోవట్లేదని ఏడ్చేసిన వసుధార!

'గుప్పెడంత మనసు' సీరియల్ ఎపిసోడ్-669లోకి అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో.. రిషి దగ్గరికి వచ్చి వసుధార మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ టైంలో నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు వెళ్ళిపో అని రిషి అంటాడు. నేను చెప్పేది వినండి అని వసుధార చెప్పినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. దాంతో వసుధార నేను చెప్పింది వినిపించుకోవట్లేదు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పడే అక్కడకు వచ్చిన చక్రపాణి.. వసుధార ఏడ్వడం చూస్తాడు. "మీ మధ్యలో ఉన్న అపర్ధాలు అన్నీ తొలగిపోవాలి. జరిగిందంతా చెప్పు. నీ వల్ల కాకపోతే నేను చెప్తానమ్మా" అంటూ వసుధారని ఓదార్చుతాడు చక్రపాణి.

ఆ తర్వాత రిషికి ఫోన్ చేస్తుంది వసుధార. సర్ మినిస్టర్ గారిని కలవాలి మీరు వస్తారా అని అడుగుతుంది. రిషి సమాధానం చెప్పకుండానే ఫోన్ కట్ చేస్తాడు. వసుధార కాలేజీకి వెళ్లి మిగతా ఫాకల్టీతో ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంది. అప్పుడు వాళ్ళు ప్రాజెక్ట్ గురించి కాకుండా వసుధార ఎవరిని పెళ్లి చేసుకుంది అనే ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. వసుధారకి కోపం వచ్చి "మీ పని మీరు చూసుకోండి" అంటూ వాళ్ళ మీద అరుస్తుంది.

ఆ తర్వాత వసుధార, కాలేజీ ఫాకల్టీ అంతా కలిసి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తుండగా దారిలో కార్ ఆగిపోతుంది. అంతలోనే రిషి కార్ లో వస్తాడు. "ఇంకా వెళ్లలేదా? నేను డ్రాప్ చేస్తాను" అని వాళ్ళని కార్ ఎక్కమంటాడు రిషి. వసుధార తన పక్కన కూర్చుంటుందా, వెనుక కూర్చుంటుందా అని మనసులో అనుకుంటాడు. సేమ్ వసుధార కూడా అలాగే ఆలోచిస్తూ నేను ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి అని మనసులో అనుకొని వెనకాల వెళ్లి కూర్చుంటుంది. దాంతో "పక్కన కూర్చునే నువ్వు వెనక్కి వెళ్లిపోయావ్.. ముందు సీట్ కి, వెనకాల సీట్ కి చాలా తేడా ఉంది వసుధార" అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.