English | Telugu

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన రేవంత్ భార్య !


బిగ్ బాస్ లో రేవంత్ జర్నీ అంతా కూడాఎమోషనల్ గానే సాగుతుందని చెప్పాలి. ఎందుకంటే రేవంత్ బిగ్ బాస్ లోకి రాకముందే తను తండ్రి కాబోతున్నాడని తెలిసిందే.. కాగా రేవంత్ మొదటి నుండి ఆ ఎమోషన్ తోనే హౌస్ లో ఉన్నాడు. తన భార్య శ్రీమంతం వేడుకను బిగ్ బాస్ టీవీలో చూపించగా భావోద్వేగానికి లోనయ్యాడు. అలాగే ఫ్యామిలీ వీక్ లో కూడా అందరి ఫ్యామిలీస్ వచ్చినప్పుడు కూడా రేవంత్ ఎమోషనల్ అవ్వడం చూసాం.

రేవంత్ వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు.. తన భార్య గురించి పదే పదే అడగడం. అన్విత జాగ్రత్త అని చెప్పడం. తన బ్రదర్ వచ్చిన కూడా అన్విత గురించే మాట్లాడి, ఎమోషనల్ అవడం చూసాం. బిగ్ బాస్ టీవీలో అన్విత కనిపించినప్పుడు సంతోషంగా ఫీల్ అయ్యాడు. "బిగ్ బాస్ విన్నర్ అయ్యి పుట్టబోయే నా బిడ్డకు గిఫ్ట్ ఇస్తాను" అంటూ రేవంత్ చాలా సార్లు చెప్పడం చూసాం.

అన్విత నిన్న రాత్రి ఆడపిల్లకి జన్మనిచ్చినట్లు తన ఇన్ స్టాగ్రామ్ పేజ్ కి ట్యాగ్ చేస్తూ, ప్రేక్షకులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ విషయాన్ని నాగార్జున, రేవంత్ కి సర్ ప్రైజ్ లాగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే నెటిజన్లు రేవంత్ కి ఇది డబుల్ ధమాకా అని అంటున్నారు. తనకి కూతురు పుట్టడం ఒకటి అయితే, టైటిల్ విన్నర్ మరొకటి అంటూ సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ విషెస్ చెబుతూ సంబరాలు జరుపుకుంటున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.