English | Telugu

ఏక్ హరి హోమ్ టూర్..ఎంత ప్రశాంతంగా ఉందో!

స్మాల్ స్క్రీన్ మీద స్మార్ట్ గా కనిపిస్తూ లవర్ బాయ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న నటుడు ఏకనాథ్. ఎన్నో సీరియల్స్ లో నటించాడు. ఇప్పుడు కేరాఫ్ అనసూయ సీరియల్ లో యాక్ట్ చేస్తున్నాడు. ఇక ఈయన భార్య హారిక కూడా సీరియల్స్ లోనే నటిస్తూ ఉంటుంది.

ఇక ఇప్పుడు వీళ్ళు ఒక వీడియో చేసి ఏక్ హరి అనే పేరుతో ఉన్న వాళ్ళ యూట్యూబ్‌ ఛానల్ లో అప్లోడ్ చేశారు. ఏక్‌నాథ్‌ సొంత ఊరు చిట్టూర్పులో తాను పుట్టి, పెరిగిన ఇంటిని చూపించాడు. ఈ ఇల్లు పెంకుటిల్లు, చుట్టూ పెద్ద తోట..బోలెడు మొక్కలు, లోపల చిన్న చిన్న గుడిసెలు, జామ, సపోటా, కొబ్బరి చెట్లు, తులసివనం వంటివి అన్నీ ఉన్నాయి. అన్ని గదులు కూడా ఎంతో విశాలంగా కట్టినవి. వంట చేసుకోవడానికి వీలుగా.. ఇంటి బయట ప్రత్యేకంగా ఓ పాకను కూడా కట్టుకున్నారు.

ఇక ఇంట్లో పాతకాలం నాటి వస్తువుల్ని చూపించింది హారిక. ఏకనాథ్ వాళ్ళ నాన్న ఇంటి గురించి వివరిస్తుంటే ..హారిక వీడియో షూట్ చేసింది..ఇక అక్కడ వర్షం పడుతుండేసరికి కోడలికి అత్తగారు గొడుగు పట్టారు. ఇవన్నీ చూసిన అభిమానులు.. "అబ్బా మీ ఇల్లు ఎంత బాగుంది అండి.. ప్రశాంతంగా.. హాయిగా ఉంది. మీ ఇంటిని చూస్తే.. మా బాల్యం గుర్తొస్తోంది... మీ అమ్మా, నాన్న కూడా చాలా సరదాగా మాట్లాడుతున్నారు." అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.