English | Telugu
‘పాడుతా తీయగా’ సింగర్ ఆశ్రిత్ కు హేమచంద్రకి ఉన్న రిలేషన్ తెలుసా?
Updated : Dec 21, 2022
‘పాడుతా తీయగా’ సింగర్ ఆశ్రిత్ కు సింగర్ హేమచంద్రకి ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా?పాడుతా తీయగా..అనే షో ఈటీవీలో ఎంతో ఫేమస్. 1996 లో ఈ షో మొదలైంది. ఈ షో ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. సినిమాల్లో పాటలు పాడే అవకాశాలను కూడా దక్కించుకున్నారు. ఇంకొంతమందైతే నటీనటులకు డబ్బింగ్ చెప్పే అవకాశాన్ని కూడా అందిపుచ్చుకున్నారు.
ఈ షోని ఒకప్పుడు బాలు గారు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోవడంతో ఆయన స్థానంలో ఆయన తనయుడు చరణ్ జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షో సీజన్ - 20 ద్వారా టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచి 4 లక్షల క్యాష్ ప్రైజ్ గెలుచుకుని పాపులర్ అయిన పిల్లాడు ఆశ్రిత్ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ పరిచయమే. ఈ కుర్రాడు పాట పాడే విధానం చూస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.
ఐతే ఈ కుర్రాడు స్టార్ సింగర్ హేమచంద్రతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇద్దరికీ ఉన్న రిలేషన్ ఏమిటి అనుకుంటున్నారా ? ఆశ్రిత్ రాఘవ మరెవరో కాదు హేమచంద్రకి మేనల్లుడు. హేమచంద్ర అక్క హిమబిందు పెద్ద కొడుకే ఈ ఆశ్రిత్. మరి ఫ్యూచర్ లో ఈ కుర్రాడు కూడా మేనమామలా మంచి సింగర్ అయ్యే అవకాశం ఉంది.