English | Telugu
శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి రష్మీని తప్పించే ప్లాన్ చేస్తున్న ఆది
Updated : Dec 21, 2022
జబర్దస్త్ యాంకర్ సౌమ్య మీద మనసు పారేసుకున్నాడు హైపర్ ఆది. శ్రీదేవి డ్రామా కంపెనీ 100 వ ఎపిసోడ్ లో ఆమె గురించి తెగ చెప్పేసి ఆకాశానికెత్తేసాడు. ఐతే ఈ షో యాంకర్ రష్మీ సౌమ్య గురించి ఆదిని చిన్న ఇంటర్వ్యూ చేసింది. "సౌమ్య మీకు ఎప్పుడు, ఎలా తెలుసు, ఫస్ట్ టైం సౌమ్య ఏ కలర్ డ్రెస్ వేసుకుంది. సౌమ్య మీద మీ అభిప్రాయం" ఇలా ఎన్నో ప్రశ్నలు వేసింది..ఇక ఆది తనదైన స్టయిల్లోనే జవాబులు ఇచ్చాడు "మా జబర్దస్త్ యాంకర్ పెర్ఫార్మెన్స్, డాన్స్ నాకు అన్నీ బాగా నచ్చాయి. సౌమ్య హోస్ట్ చేస్తేనే శ్రీదేవి డ్రామా కంపెనీ ఇంకా ముందుకెళ్తుందేమో అని అనిపిస్తోంది.
సౌమ్యని ముందు ఈటీవీ 27 ఇయర్స్ ఫంక్షన్ లో కలిసాను. అప్పుడు ఆ అమ్మాయిని చూసాకా ఎప్పటికైనా ఇలాంటి అమ్మాయి పక్కన ఉంటే బాగుండనిపించింది. సౌమ్యను ఫస్ట్ చూసినప్పుడు లైట్ పింక్ కలర్ డ్రెస్ వేసుకుని కనిపించింది. సౌమ్య ఎక్కడుంటే నాకు అక్కడే ఉండాలనిపిస్తోంది." అని చెప్పాడు ఆది. అదేంటి ఈ స్టేజి మీద వర్ష, రష్మీ ఉన్నారు కదా వాళ్ళను ఎందుకు పడేయట్లేదు అని సౌమ్య అడిగేసరికి వాళ్ళల్లో లేని ఫీల్ ఏదో నిన్ను చూసినప్పుడు వచ్చింది అని మరో బిస్కట్ వేసాడు. దాంతో జడ్జి ఇంద్రజ ఎంట్రీ ఇచ్చి "రష్మీ మీ జోడి తొమ్మిదేళ్లు చూసినా బోర్ కొట్టలేదు కానీ ఆది వేసే ఈ ఎక్స్ట్రా డైలాగ్స్ వింటుంటే చాలా బోర్ కొడుతోంది" అని కౌంటర్ వేసింది.